పొన్నూరు సీఐ కృష్ణయ్య ఓవరాక్షన్‌.. 

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ పీటా మోహన్ కృష్ణపై దౌర్జన్యం 

గుంటూరు: రేపల్లె వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్ కృష్ణపై పొన్నూరు సీఐ కృష్ణయ్య దౌర్జన్యానికి దిగారు. మామిళ్లపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుల దాడికి గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న పీటా మోహన్ కృష్ణను మామిళ్లపల్లి శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసుల వైఖరికి నిరసనగా పీటా మోహన్ కృష్ణ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా పొన్నూరు సీఐ కృష్ణయ్య ఆగ్రహంగా వ్యవహరిస్తూ “ఓవరాక్షన్ చేస్తున్నారు ఏంట్రా” అంటూ పీటా మోహన్ కృష్ణను ఈడ్చుకుంటూ వెళ్లి కింద పడేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వైయ‌స్ఆర్‌సీపీ నేతపై పోలీసుల దౌర్జన్యాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలను అణిచివేసేలా పోలీసులు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు.
 

Back to Top