అమలాపురం : ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను కలిసి ఫిర్యాదు సమర్పించారు. పీ గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు, అంబాజీపేట–అయినవిల్లి మండల పార్టీ అధ్యక్షుడు యన్నాబత్తుల ఆనంద్, విత్తనాల ఇంద్రశేఖర్, మేడిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, తోరం భాస్కరరావు, దొమ్మేటి శివరాం, అడ్డగల సాయిరాం, ముల్లేటి త్రిమూర్తులు, నక్క వెంకటేశ్వరరావు, చాట్ల రామారావు, కుడుపూడి విద్యాసాగర్, బొంతు శ్రీనివాస్, దొమ్మేటి సత్యమోహన్, రాణి శ్రీధర్, తోరం గౌతమ్, కొంబత్తుల ఏసుబాబు, నూకపీయి రాజేంద్ర, యండ్రా ఏసుబాబు, దేవరపల్లి గౌతమ్, చప్పిడి పండు, చింత రాంబాబు, కోనే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.