కాకినాడలో ఎస్పీని కలిసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్ 

కాకినాడ :  ఏబీఎన్ రాధాకృష్ణపై ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకినాడ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, తుని నియోజకవర్గ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ, పిఠాపురం కోఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్, ప్రత్తిపాడు కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పెద్దాపురం కోఆర్డినేటర్ ధవళూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top