కక్షసాధింపుతోనే స‌జ్జ‌ల భార్గ‌వ‌రెడ్డిపై అక్రమ కేసులు  

మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ 

మదనపల్లె: వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ పూర్వ‌పు ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ రెడ్డి పై రాజకీయ కక్షసాధింపుతోనే అక్రమ కేసులు నమోదు చేశారని వైయ‌స్ఆర్‌సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మండిప‌డ్డారు.  అక్రమంగా నమోదు చేసిన కేసు విచారణ నిమిత్తం సజ్జల భార్గవ రెడ్డి సోమ‌వారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా  నిసార్ అహ్మద్  మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై స్పందించినందుకు ఇలాంటి కేసులు నమోదు చేయడం తగదని పేర్కొన్నారు. విచారణకు హాజరైన సజ్జల భార్గవ రెడ్డికి చట్టపరమైన ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని, రాజకీయ ఒత్తిడులతో కేసులు నమోదు చేసినా న్యాయం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆయనకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యురాలు షమీమ్ అస్లాం, మాజీ మునిసిపల్ చైర్మన్ మనుజ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనాథ్ రెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రెడ్డి, ఎస్‌కే ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, కొత్తపల్లి మహేష్ జావీద్, కొత్తపల్లి నాగార్జున, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, యూనస్, శంకర్ నాయక్, వాడిగల శ్రీకాంత్ రెడ్డి, మాలెపాడు చలపతి, నవాజ్, భాను, మహేశ్, యాసీన్, చరణ్, మధు, అనిల్, అబ్దుల్లా నజీర్ తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top