రాజాంలో పెట్రోల్, డీజిల్ కొరత

ప్ర‌భుత్వ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేత తలే రాజేష్ ఆగ్ర‌హం

రాజాం: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో సమస్య తీవ్రంగా ఉందని వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజాం పరిధిలోని అనేక పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా ఉందన్నారు. వాహనదారులు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కొన్నిచోట్ల “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే విధంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ పరిస్థితికి పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తక్షణమే సరఫరాను సరిచేసి ప్రజలకు కలిగిన ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం టౌన్ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు, ఎంపీపీ లావేటి రాజగోపాల్ నాయుడు, జడ్పిటిసి బండి నరసింహులు, వైస్ ఎంపీపీ యాలాల వెంకటేష్, వకుముల్ల చిన్నం నాయుడు, సలాది సతీష్, గంధవరపు హేమంత్, డా. బి నరేంద్ర, కోరాడ రామనాయుడు, పొట్నూరు రవి, పిట్ట సింహాద్రి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top