తాడేపల్లి: సంక్షేమంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త శకానికి నాంది పలికారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో అమలవుతోందని, ప్రజల వద్దకే నేరుగా ప్రభుత్వ పాలన అందుతోందన్నారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల కుటుంబాలను జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కలిశామన్నారు. అర్హులందరికీ వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందించామని చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అమరావతి పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. చంద్రబాబులా మా ప్రభుత్వం ఎవరికీ దోచి పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. చంద్రబాబు పాలన రాష్ట్ర ప్రజలకు ఓ పీడకల. గతంలో ఒక పీడకలగా ఉన్న వ్యవస్థను పూర్తిగా, సంపూర్ణంగా మార్చి ఒక కొత్త శకానికి సీఎం వైయస్ జగన్ నాంది పలికారు. తన తండ్రి మాదిరిగా శాచ్యూరేషన్ పద్ధతిలో సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉంటే చాలు సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు అందించేందుకు వైయస్ జగన్ ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు. ఈ ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు సంక్షేమ ఫలాలు అందించేందుకు కో–ఆర్డినేటెడ్‌గా పని చేసే వ్యవస్థను వైయస్ జగన్ తీసుకువచ్చారు. పథకాలను డెలివరీ చేసేందుకు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థను తెచ్చారు. ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా యంగ్ బ్లెడ్‌ను తీసుకువచ్చారు. ఈ వ్యవస్థకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. 1వ తేదీనే అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడమే కాకుండా సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేస్తున్నారు. గ్రామాల్లోనే ఆర్‌బీకే వ్యవస్థను ఏర్పాటు చేసి రైతులను చెయ్యి పట్టి నడిపిస్తున్నారు. ఏ సీజన్‌కు సంబంధించిన పరిహారం అదే సీజన్‌లో ఇవ్వడం, బీమా పరిహారం చెల్లించడం, ప్రతి పథకం క్యాలెండర్ పెట్టుకుని అమలు చేస్తున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు కూర్చొని పరిష్కరిస్తున్నారు. ఇంకా ప్రోయాక్టివ్ సమస్యలను పరిష్కరించేందుకు జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కరిస్తున్నారు. ఇంకా ఏదైనా సమస్య ఉంటే ప్రజల వద్దకే వెళ్లి వారికి కావాల్సిన సర్వీసులు అందిద్దామన్న ఆలోచనతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి ద్వానికి గైడ్ లైన్ ప్రిపరేషన్, టైమ్‌లైన్, డెలివరీ చేయడానికి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ రోజు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత సీనియర్ అధికారులతో సహా క్షేత్రస్థాయికి వెళ్లారు. వైయస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. అందుకే బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ వైయస్ జగన్ వ్యక్తిగా వెళ్లలేనిది ఒక వ్యవస్థను గడప గడపకు తీసుకెళ్తున్నారు. ఆ రోజు ఆయన వెళ్లారు కాబట్టే సమస్యను వివి మానవత్వం ఉన్న వ్యక్తిగా, నాయకుడిగా ఈ సమస్యలను పరిష్కరించారు. ఇప్పుడు అదే మానవత్వంతో మరో ముందడుగు వేశారు. వ్యవస్థను గడప వద్దకు తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు జగనన్న సురక్ష కార్యక్రమం ఇంత విజయవంతమైంది. ఈ రెండు వైయస్ జగన్‌కే దక్కుతాయి. జూన్ 23వ తేదీన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జులై 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు 15 వేల గ్రామ సభలు నిర్వహించాం. మొత్తంగా కోటి 46 లక్షల కుటుంబాలను, ఇళ్లను వలంటీర్లు సందర్శించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎలాంటి సర్వీసు అవసరం అని ఆరా తీశారు. 94.5 లక్షల వినతులు వస్తే వాటిలో 93 లక్షల సమస్యలు పరిష్కరించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో 97 శాతం సమస్యలు పరిష్కరించారు. 45 లక్షల మందికి కుల ధ్రువీకరణ పత్రాలు, 41 లక్షలు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ అప్‌డెట్ సర్టిఫికెట్లు, ఆర్‌వోఆర్, ల్యాండ్ టైటిల్, అడంగల్ సర్టిఫికెట్లు అందజేశాం. ఇవన్నీ నెల రోజుల్లోనే పరిష్కరించాం. వారంలో వలంటీర్లు రిక్వేస్ట్ తీసుకొని పరిష్కరించారు. ఇవన్నీ పెండింగ్ కాదు. గతంలో సచివాలయాల ద్వారా 30 రోజులు, 45 రోజులు పట్టేది. వీటి కోసం పనులు ఆపుకొని కార్యాలయాల చుట్టు తిరిగాలి. ఈ సారి వ్యవస్థనే ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరించారు. ఇదే కార్యక్రమాన్ని ఏడాదిలో రెండుసార్లు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచిస్తున్నారు. ఎన్ని ఉన్నా సరే ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. నిరంతరం అవసరమైన జీవన కార్యాకలాపాల్లో పెద్దగా కష్టపడకుండా ఇంటి వద్దనే అందజేసే వ్యవస్థ పటిష్టంగా అమలవుతుంది. ఇందులో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సీనియర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అందుకే ఇంతగా సక్సెస్ అయ్యింది. మరింత విజయవంతం అయ్యేందుకు మీడియా కూడా సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు,వరదలు సంభవించిన సమయంలోనూ ప్రతిసారి చంద్రబాబు, ఆయన వెంట ఉన్నవారు పాయింట్ అవుట్ చేసేది ఒక్కటే..వేర్ ఈజ్ ముఖ్యమంత్రి అంటున్నారు. డిజాస్టర్ గైడ్‌లైన్స్ ప్రకారం వీవీఐపీలు సంఘటన స్థలాలకు వెళ్లకూడదని ఉంది. ఆ సమయంలో వీవీఐపీలు వ్యవస్థను బాగా పని చేసేలా చూడాలి. సీఎం వైయస్ జగన్ ఇలాంటి సమయంలో కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టి వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నారు. నష్టపరిహారం అందిస్తున్నారు. ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లు ప్రతి 60, 70 ఇళ్లకు ఉన్నారు కాబట్టి వారు బాధితులను క్యాంపులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు. అందుకే ఎక్కడిక్కడ పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి రివ్యూ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో స్క్రీన్ అంతా ఆయనే ఉంటారు. అధికారులంతా ఆయన వెంటే ఉంటారు. బాధితులకు ఎలాంటి సాయం అందేది కాదు. ఏది బెటర్..వైయస్ జగన్ తాను చేసేది మంచిదని గుర్తించారు. వైయస్ జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో ఎక్కడిక్కడే సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. వైయస్ జగన్ తెచ్చిన వ్యవస్ధ ద్వారా పారదర్శకత, అవినీతి నిర్మూలన, రియల్ టైమ్‌లో సహాయం అందుతోంది. గతంలో విత్తనాలు కావాలంటే రైతులు క్యూ లైన్‌లో చెప్పులు పెట్టేవారు. ఎరువుల కోసం గొడవలు జరిగేవి. ఇప్పుడు ఇవేవీ జరగడం లేదు. వైయస్ జగన్ అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఆర్5 జోన్‌పై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తాం. వైయస్ జగన్ పేదల పక్షాన నిలబడ్డారు. చంద్రబాబు, టీడీపీ అటువైపు ఒక చిన్న గ్రూప్ పెత్తందార్ల వైపు నిలబడ్డారు. అమరావతికి 30 వేల మంది ఇచ్చిన భూములు చాలా మంది చేతులు మారాయి. అక్కడి రైతుల ప్రకారం నడవాలంటే అదేమన్న రియల్ ఎస్టేట్ వెంచరా?. దానిపై భూమి ఇచ్చిన వారికి పూర్తి హక్కు ఉండదు. సిటి డెవలప్‌మెంట్‌కు అవరోధంగా ఏమైనా చేస్తే అడ్డుకోవాలి. అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎవరికి?. అక్కడ కాలేజీలు వచ్చాయి..సంస్థలు వచ్చాయి..అక్కడ ఎవరున్నారు? కరకట్టకు రోడ్డే లేదు. కృష్ణానదీ నుంచి కాజా వరకు బైపాస్ వేశారు. దాన్ని వైయస్ జగన్ పూర్తి చేస్తున్నారు. ఇది కాదా అభివృద్ధి. పేదలకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారు. చట్టంలోనే ఉంది..పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చట్టం చేశారు. చంద్రబాబు చూపించిన రంగుల కల కాదు డెవలప్‌మెంట్, లేదా సింగపూర్‌కు 30 ఏళ్లకు అప్పన్నంగా భూమి ఇచ్చి రియల్ ఎస్టేట్‌కు అప్పజెప్పారు. దాన్నికి భిన్నంగా వైయస్ జగన్ ఒక సజీవమైన నగరం అభివృద్ధి చెందేలా రోడ్డు కనెక్టివిటి, ఎకనామిక్ గ్రోత్ బిల్డ్ కాబోతోంది. ఏది అభివృద్ధి. ఇచ్చింది ఎవరికి దోచిపెట్టలేదు. పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చాం. పేదలు లేనిది సమాజమే లేదు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కదా? చంద్రబాబుకు అర్ధం కావడం లేదు. పేదలకు ఇస్తున్న ఇళ్లను చంద్రబాబు అడ్డుకోవడం దుర్మార్గం. వైయస్ జగన్ అక్కడ పంతం కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. డీబీటీ స్కీమ్ యజ్ఞం మాదిరిగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 30 వేల ఎకరాలు ఏం చేసుకుంటారు. అడ్డం కొట్టాలనే శక్తులు అవతలి వైపు నుంచి ప్రయత్నిస్తున్నారు. కోర్టు తీర్పుతో రొమ్ములు విరుచుకుని తిరుగుతున్నారేమో? వాళ్ల వాదనలు ఆశ్చర్యంగా ఉంది. వాళ్లు చేసే ప్రయత్నం ఫలించదు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.