స‌జ్జ‌ల భార్గ‌వ‌రెడ్డిపై అస‌త్య ఆరోప‌ణ‌లు త‌గ‌దు

వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా సలామ్  

అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను ఇబ్బంది పెట్టాల‌నే కుట్రలో భాగంగానే వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ స‌జ్జ‌ల భార్గ‌వరెడ్డిపై అస‌త్య ఆరోప‌ణ‌లు, త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా సలామ్  మండిప‌డ్డారు. స‌జ్జ‌ల భార్గ‌వ‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. గురువారం అనంత‌పురం న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో బాబా స‌లామ్ మీడియాతో మాట్లాడుతూ..` కూటిమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యినపుడు నుంచి ఏ కేసు చూసిన వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా నాయకులను, యాక్టివిష్టులను ఇరికించే ప్రయత్నం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే ఎలాంటి ఆధారాలు చూపకుండా ఇప్పటికే కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఏపీ లిక్కర్ కేసులో తాజాగా వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు విష ప్ర‌చారం చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా  నాయకులను ఇబ్బంది పెట్టె విధంగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బ‌నాయిస్తోంది. అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు`అని బాబా స‌లామ్ హెచ్చ‌రించారు. 

Back to Top