అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందుకు వాస్తవాలతో తీసుకెళ్లేందుకు జగనన్న 2.0 యాప్ కీలక వేదికగా నిలుస్తుందని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో జగనన్న 2.0 యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ, ప్రజలకు పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో జగనన్న 2.0 యాప్ ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మరింత మందికి చేరవేసి, డిజిటల్ వేదికల ద్వారా ప్రజల్లో వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అనంతపురం నగర మాజీ మేయర్ వసీం సలీమ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు జగనన్న 2.0 యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, వైయస్ఆర్‌సీపీ సిద్ధాంతాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తామని తెలిపారు. జగనన్న 2.0 యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైయస్ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, బూత్ కన్వీనర్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమరనాథ్ రెడ్డి, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్, సోషల్ మీడియా నగర అధ్యక్షుడు గోళ్ళ శ్రావణ్ కుమార్ రెడ్డి, కొర్రపాడు హుస్సేన్ పీరా, సాకే కుల్లాయి స్వామి తదితరులు పాల్గొన్నారు.