విశాఖ : రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై కూటమి ప్రభుత్వ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. నిన్న 41ఏళ్ల నోటీసుల పేరుతో ఇంటూరి రవికిరణ్, ఆయన భార్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వివాదం కావడంతో వదిలేశారు. అయితే ఈ రోజు మరోసారి ఇంటూరి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు వెల్లడించకుండా తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తీసుకెళ్లడం కలకలం రేపుతుంది. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు శనివారం ఇంటూరి రవికిరణ్ ఇంటికి వచ్చిన పోలీసులు తీవ్ర ఇబ్బందులు గురి చేశారని రవికిరణ్ భార్య మీడియా ఎదుట వాపోయారు. తనతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు, తన భర్తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ప్రశ్నించగా.. ఎలాంటి ఇష్యూ చేయొద్దంటూ బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.