మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనాగ్ర‌హం

రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు

ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి ప్ర‌సాదించాలంటూ అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు విన‌తులు

తాడేప‌ల్లి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వ‌ర్యంలో  రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్‌ప‌రం చేయ‌కుండా కూట‌మి నేత‌ల‌కు, ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని కోరుతూ అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు విన‌తిప‌త్రాలు అంద‌జేశారు.

ఎన్టీఆర్ జిల్లా..:
వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో  మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అజిత్‌సింగ్‌ నగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ రాహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైయ‌స్‌ జగన్ ఐదేళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చార‌ని తెలిపారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్, పవన్‌ ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారురు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కలను చిదిమేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. మెడికల్ కాలేజీల పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారు.. కేసులు పెట్టారు. నిర్బంధంతో పోరాటం ఆపలేర‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామ‌ని దేవినేని అవినాష్ హెచ్చరించారు.

విశాఖ:
 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ  వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి సర్కార్‌ అంటూ మండిపడ్డారు. `వైయ‌స్‌ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు పెడుతున్నారు. పేదల పక్షపాతి వైయ‌స్ జగన్. దళితుల జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’’ అంటూ గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయ‌స్ఆర్ క‌డ‌ప‌ జిల్లా:
కడప న‌గ‌రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

కృష్ణాజిల్లా :
మచిలీపట్నంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వ‌ర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహం దగ్గర కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్ట జాన్ విక్టర్, గుడివాడ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోవాడ అశోక్, పామర్రు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, కొడాలి సురేష్,  రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్ర‌తినిధి మండ కిరణ్ కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ నడకుదురు రాజేంద్ర, స్టేట్ జాయింట్ సెక్రెటరీ గాడెల్లి  డేవిడ్, బురద రామారావు, జక్కుల ఆనంద్ బాబు, గడిదేశి రాజు, గూడవల్లి నాగరాజు, పోలిమెట్ల వంశీ, నితీష్ చంద్ర, మాది శివరామకృష్ణ, పరదేశి బాల యేసు, తదితరులు పాల్గొన్నారు 

అనంతపురం:
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయ‌కులు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ప్ర‌భుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయవద్దని నినాదాలు చేస్తూ నల్లబ్యాడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు.   

తిరుపతి: 
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు రాజేంద్ర మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పునరాలోచన చేయాలంటూ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం డిమాండ్‌ చేశారు.

గుంటూరు: 
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. 

విజయనగరం:
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయనగరంలో ఎస్సీ విభాగం ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. కలెక్టర్ కార్యాలయ దగ్గర డాక్ట‌ర్‌ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద  వైయ‌స్ఆర్‌సీపీ విజయనగరం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైహింద్ కుమార్ ఆధ్వర్యంలో చేప‌ట్టిన‌ నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు  మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పాల్గొన్నారు. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించిన అనంత‌రం వినతిప‌త్రాన్ని అంద‌జేశారు.  కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీపీ సూర్యనారాయణ రాజు,  జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రీ నర్సింమూర్తి , ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు బుంగ భానుమూర్తి , జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు అవినాష్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా:
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన‌కాప‌ల్లి 4రోడ్స్ జంక్ష‌న్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జంక్ష‌న్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి ఎస్సీ సెల్ నాయ‌కులు విన‌తిప‌త్రం అంద‌జేశారు. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోక‌పోతే ఉద్య‌మం తీవ్ర‌త‌రం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. 

ఏలూరు : 
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వ‌ర్యంలో నిరసన కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఎస్సీ సెల్‌ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ , ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ఎ, స్సీ సెల్‌, అనుబంధ విభాగాల నాయకులు అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం అంద‌జేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా సామాన్యులు, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు, వారి పిల్లలు నష్టపోతారని వారు గుర్తు చేశారు.  రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుమతులు తెచ్చిన ఘనత మాజీ సీఎం వైయ‌స్ జగన్‌కే దక్కుతుందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని చూడడం సరైన విధానం కాదన్నారు.   

అన్న‌మ‌య్య జిల్లా:
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు.  అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై నినాదాలు చేశారు.  

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:
వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేప‌ట్టి విన‌తిప‌త్రం అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దీపిక వేణురెడ్డి, మడకశిర సమన్వయకర్త  ఈర లక్కప్ప,  జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సూర్య మోహన్, రాష్ట్ర మైనారిటీ విభాగం సెక్రెటరీ షేక్ అమానుల్లా, రాష్ట్ర మైనార్టీ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్ఎం ఫరూక్, నాయకులు మలుగూరు శివన్న, బాపూజీ నగర్ శ్రీరాములు, అంబేద్కర్ నవీన్, నరసింహులు ,అయూబ్ బేగ్, ఎరుకల శంకర , జంగం చందు, మేళాపురం రవి , హనుమంతరాయప్ప, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ‌కాకుళం:
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ‌కాకుళం జిల్లా ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నిరసన తెలిపారు. పీపీపీ విధానాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని, పేద‌ల‌కు వైద్యం దూరం చేయ‌వ‌ద్దంటూ నిన‌దించారు. అనంత‌రం అంబేడ్కర్ విగ్రహానికి  వినతి పత్రం అంద‌జేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజేతి కృష్ణ మూర్తి, పొన్నాడ రిషి, ధర్మాన రాం మనోహర్ నాయుడు, దుంపల లక్ష్మణ రావు, అందవరపు సూరిబాబు , రౌతు శంకర రావు, తదితరులు పాల్గొన్నారు. 

బాపట్ల జిల్లా: 
 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ బాప‌ట్ల‌లో వైయ‌స్ఆర్‌సీపీ సెల్ విభాగం ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, ఎస్సీ విభాగ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం అంద‌జేశారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా:  
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ అమ‌లాపురంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వ‌ర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈదరపల్లి వంతెన వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు  గొల్లపల్లి  డేవిడ్, మాజీ మంత్రి, రాజోలు కో-ఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావు, పి. గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ , జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రావు , మాజీ ఎమ్మెల్యే  పాముల రాజేశ్వరి దేవి, ఎస్సీ  సెల్ నియోజకవర్గ, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా:
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యస్.సి సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్యతిరేకిస్తూ నెల్లూరు న‌గ‌రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీలు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి,  మేరిగ మురళీధర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, యస్.సి సెల్ అధ్యక్షుడు కామ రాజు, యస్.సి సెల్ రాష్ట్ర కార్యదర్శి స్వర్ణ వెంకయ్య, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా:
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు చిత్తూరు దర్గా సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్.సి సెల్ ఆధ్వర్యంలో నిరస‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలుప్రైవేట్‌ప‌రం చేయ‌వ‌ద్దంటూ నినాదాలు చేశారు. కార్య‌క్ర‌మంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చిత్తూరు  ఇంచార్జి విజయనంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు డాక్టర్ సునీల్, లలిత కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా:
వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఒంగోలు న‌గ‌రంలోని క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌ అంబేద్కర్ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయ‌కులు నిరసన కార్యక్రమం చేప‌ట్టి విన‌తిప‌త్రం అంద‌జేశారు.  కార్య‌క్ర‌మంలో మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదెన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర  కార్యదర్శి చిలకా ఇశ్రాయేలు, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త  కార్యదర్శి దుడ్డు వినోద్, ఎస్సీ సెల్ ఒంగోలు పట్టణ అధ్యక్షులు గోపీ చంద్, పార్టీ ఎస్సీ నాయకులు, మాజీ ఎంపిపి కే నరసింహారావు,(పొదిలి) జె. ఇశ్రాయేలు, మధు, కంభంపాటి సన్నిబాబు, జి సామేలు, డగ్లస్, దర్శి నియోజకవర్గ అధ్యక్షులు  జి. ఏసుదాసు, మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షులు ఆదిమూలపు లూకా, పూనూరి దేవదానం, సంతనూతలపాడు నియోజకవర్గ  ఎస్సీ సెల్ అధ్యక్షులు తేళ్ల పుల్లారావు,  రాయపాటి విల్సన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

పార్వ‌తీపురం జిల్లా:
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పిపిపి విధానంలో ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వ‌ర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేప‌ట్టారు.  పార్వతీపురం ఇందిరా కాలనీ ప్రధాన రహదారి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నేత‌లు వినతి పత్రం అందచేశారు. తక్షణం పీపీపీ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియచేస్తూ పోరాటాన్ని ఉదృతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే జోగారావు హెచ్చరించారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మావిడి శ్రీనివాసరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు, జడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీ నాయుడు,  పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మీ రమేష్, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు లోలుగు నారాయణరావు, నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షులు కోల సుధాకర్, మజ్జి అప్పారావు,  నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

పల్నాడు జిల్లా:
ప్రభుత్వ మెడికల్ కళాశాలలు  ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మల్లమ్మ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంత‌రం అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. ఎస్సీ సెల్ నాయకులు విన‌తిప‌త్రం అంద‌జేశారు.

నంద్యాల జిల్లా:
వైయస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధినేత  వైయస్‌ జగన్‌ మోహాన్‌ రెడ్డి ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారాసుదీర్ ,రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌ బైరెడ్డిసిద్దార్థరెడ్డి  ఆధ్వ‌ర్యంలో నంద్యాల ప‌ట్ట‌ణంలోని బొమ్మ‌ల‌స‌త్రంలో అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ఎస్సీ సెల్ నాయ‌కులు నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. మెడిక‌ల్ కాలేజీ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఎస్సీ సెల్ నాయ‌కులు డిమాండ్ చేస్తూ, అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం అందజేశారు. కార్య‌క్ర‌మంలో నందికొట్కూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మార్కెట్‌ రాజు, క్రిస్టియ‌న్‌ సెల్‌ తాలుకా అధ్యక్షుడు ల్యాబ్‌ రవి, కిషోర్‌, దేవరాజు పాల్గొన్నారు.

క‌ర్నూలు జిల్లా:
మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ క‌ర్నూలు న‌గ‌రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి  మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌, ఎస్సీ సెల్ నాయ‌కులు పాల్గొన్నారు. 

Back to Top