రాష్ట్రాన్ని పాలిస్తున్న‌ది ఓ దొంగ‌..రాక్ష‌సుడు..నేర‌గాడు

నెల్లూరు సమర శంఖారావం సభలో వైయస్‌ జగన్‌

బాబు తీరు..దొంగే దొంగ అన్నట్లుగా ఉంది

వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారు

చివరకు మా సొంత చిన్నాన్న వైయస్‌ వివేకానందరెడ్డి ఓటు కూడా తొలగించారు
రేపటి పాలనకు మీరే దిక్సూచి

నెల్లూరు: ఈ రాష్ట్రాన్ని ఓ దొంగ‌..రాక్ష‌సుడు..నేర‌గాడు పాలిస్తున్నాడ‌ని, ఆయ‌నను ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి వంటి ఎల్లోమీడియా మోస్తుంద‌ని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిప‌డ్డారు. తొమ్మిదేళ్లు నాకు అండగా నిలిచారని, ఈ కాలంలో పార్టీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కొందరు ఆస్తులు కోల్పోయారని, మరి కొందరు కుటుంబ సభ్యులను కోల్పోయారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని, రేపటి పాలనకు బూత్‌ కమిటీ సభ్యులే దిక్కూచిగా నిలబడతారని చెప్పారు. ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటానని, అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం నెల్లూరు న గరంలోని ఎస్వీజీఎస్‌ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభలో వైయస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన ప్రసంగం ఇలా..

ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడికి, చెరగని చిరునవ్వుతో ఆప్యాయత చూపిస్తున్న నా ప్రతి కుటుంబ సభ్యుడికి ముందుగా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నాం. తొమ్మిదేళ్లు నాకు అండగా నాతోపాటు నడిచారు. ప్రతిపక్షంలోనే ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నవారు ఎన్ని కష్టాలు, బాధలు పెట్టారో నాకు తెలుసు. ఎంతగా నష్టపోయారో నాకు తెలుసు. రాష్ట్రంలోని 13 జిల్లాలోని ప్రతి కార్యకర్త ఎన్ని కష్టాలు భరించారో నాకు తెలుసు. కొందరు కేసులను భరించారు. అవమానాలను సహించారు. లాఠీదెబ్బలు తిన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్నారు. మీ ప్రతి కష్టాన్ని చూశా. మీ ప్రతి నష్టాన్ని చూశా. మీకు తగిలిన ప్రతి గాయం.. నా గుండెకు కూడా తగిలింది. మీ ప్రతి బాగోగులు నేను చూసుకుంటానని అందరికీ మాటిస్తున్నా.. మీకు అండగా ఉంటా.. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చుకుంటానని హామీ ఇస్తున్నా. 

మీపై పెట్టిన దొంగ కేసుల గురించి నాకు తెలుసు. ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడికి నేను చెబుతున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే దొంగ కేసులన్నీ ఎత్తేస్తాం. దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చల్లని దీవెనలతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు. చివరకు పార్టీలు కూడా చూడొద్దు. ప్రతి పేదవాడికి సంక్షేమాలు అందించే విషయంలో మీరే ముందుంటారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన హయాంలో రావాలి. ఆ పాలనకు దిక్సూచిగా మీరే నిలబడతారని వేదికపై నుంచి హామీ ఇస్తున్నా. 

చంద్రబాబు పాలన చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కొన్ని కథలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. మంచి చేశాను నాకు ఓట్లు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదు. రాష్ట్రంలో 59.16 లక్షల దొంగ ఓట్లు నమోదై ఉన్నాయి. ఏ స్థాయిలో చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నాడో చూడండి. రాష్ట్రంలో 59.16 వేల దొంగ ఓట్లు ఉన్నాయని, ఇందులో 20 లక్షల ఓట్లు తెలంగాణ, మన రాష్ట్రంలో కలిసి ఉన్నాయని, మరో 39 లక్షల ఓట్లు ఒక్క మన రాష్ట్రంలోనే రెండు ఓట్లు ఉన్నాయని ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్‌కు డూబ్లికేట్‌ ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేశాం. దొంగ ఓట్లు ఏరివేసేందుకు, సరైన ఓట్లను మళ్లీ చేర్పించేందుకు మన వారు ఎవరైనా ఎన్నికల సంఘానికి అర్జీ పెడితే మనం వ్యవస్థలను నాశనం చేస్తున్నామని చంద్రబాబు అంటున్నాడు. 

దొంగ ఓట్లను తానే చేర్చుతున్నాడు. మళ్లీ తానే దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అని అరవడం మొదలుపెట్టినట్లుగా ఉంది బాబు తీరు. తొలగించిన ఓట్ల జాబితాలో వైయస్‌ వివేకానందరెడ్డి పేరు కూడా ఉంది. నా సొంత చిన్నాన్న ఓటు కూడా తొలగించారు. ఎల్లో మీడియా మద్దతు ఉందని, ఏమన్నా.. చెల్లుబాటు అవుతుందని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానల్, రకరకాల ఎల్లో మీడియా ఛానళ్లు తోడుగా ఉన్నాయని ఇష్టం వచ్చినట్లుగా తానే అబద్ధాలు ఆడుతూ, అన్యాయం చేస్తున్నాడు. ఎదుటివాడు అన్యాయం చేస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నాడు. 

తొలగించిన జాబితాలో వైయస్‌ వివేకానందరెడ్డి పేరుంది కానీ, ఎక్కడా నారా లోకేష్‌ పేరు ఉండదు. ప్రతి నియోజకవర్గంలో వేల ఓట్లను తొలగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ వరకు ఈ కుట్ర విస్తరించింది. చివరకు ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్‌ ఫొటోల ఎన్నికల డేటా.. చంద్రబాబు ప్రైవేట్‌ కంపెనీల దగ్గర దొరుకుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఆధార్, యూఐడీ డేటా బాబు ప్రైవేట్‌ కంపెనీల దగ్గర దొరుకుతుంది. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన ఆధార్‌కార్డు డేటాను, కలర్‌ ఫొటోల ఎన్నికల డేటాను చంద్రబాబు ప్రైవేట్‌ సంస్థల దగ్గర దొరుకుతుందంటే ఇది ఎంత పెద్ద నేరమో మనం చెప్పాల్సిన పనిలేదు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు చెప్పాయి. ప్రజలకు సంబంధించిన డేటా ఎవరి వద్ద ఉండకూడదని చెబితే.. చంద్రబాబు బినామీల దగ్గర ఉన్న కంప్యూటర్ల వద్ద దొరుకుతున్నాయంటే ఏ స్థాయిలో వీరు వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటే ఇంతకంటే వేరే నిదర్శనం కావాలా..?

ఈ రోజు ఒక దొంగ మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఒక రాక్షసుడు మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఒక నేరగాడు మన రాష్ట్రాన్ని పాలిస్తున్న అన్యాయ పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ప్రజా స్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూనే నిసిగ్గుగా బుకాయిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇటువంటి సమయంలో కూడా చంద్రబాబును మోస్తావున్నది ఎల్లో మీడియా. 

ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ5కి చంద్రబాబు ఏం చేసినా తప్పు అనిపించదు. ప్రజలకు సంబంధించిన డేటా ప్రైవేట్‌ కంపెనీల దగ్గర దొరుకుతుందంటే గొడవ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి. ఇలాంటివి చేయకుండా చంద్రబాబును భుజాన వేసుకుంటున్నారు. చంద్రబాబు చేసిన నేరం ఎంత తీవ్రమైందంటే మీ బ్యాంకు అకౌంట్లను హ్యాక్‌ చేసిన వారికంటే దారుణం. 

చంద్రబాబును గట్టిగా అడుగుతున్న. బదలాయించకూడని డేటా ప్రైవేట్‌ కంపెనీలకు ఎందుకు ఇచ్చావు. బ్లూఫ్రాగ్, ఐటీగ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ కంపెనీలు టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర ఆప్‌ను కూడా వీరే తయారు చేశారు. ఈ ప్రైవేట్‌ కంపెనీల్లో ఓటర్ల లిస్టు డేటా వీరి వద్ద ఎందుకు ఉంది. ఈ కంపెనీలు ఎవరివి, ఎవరు పెట్టించినవి, ఆ కంపెనీల యాజమాన్యంతో వీరికి ఉన్న సంబంధం ఏంటీ..? వీరు ఎందుకు వందల సార్లు చంద్రబాబు, లోకేష్‌లను కలిశారు. ప్రైవేట్‌ కంపెనీల యాజమాన్యాలు దిగిన ఫొటోలు ఏం సంకేతాన్ని ఇస్తున్నాయి. ఏపీ పౌరుల వ్యక్తిగత డేటాతో ఈ కంపెనీలకు ఏం సంబంధం ఉంది. డేటాను ప్రైవేట్‌ కంపెనీలకు ఎవరిచ్చారు. ఈ డేటాను దొంగతనం చేయడం నేరం కాదా..? చేసిన కంపెనీలకు, చేయించిన చంద్రబాబుకు శిక్ష పడాల్సిన పనిలేదా..? ఈ కంపెనీలపై తెలంగాణ పోలీసులు దాడులు చేస్తే ఆ కంపెనీల్లో పనిచేస్తున్న యాజమాన్యాలు చంద్రబాబుకు వాట్సాప్‌ మెసేజ్‌ ఇవ్వగానే తనకు సంబంధించిన పోలీసులను పంపిస్తాడు. మళ్లీ ఆ డేటా ఎక్కడ బయటకు వస్తుందో.. అన్యాయం ఎక్కడ బయటకు వస్తుందోనని కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు మన రాష్ట్ర పోలీసులను తన సొంత వాచ్‌మెన్‌లకంటే దారుణంగా వాడుకుంటున్నారంటే ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తేనా..? 

 

 

ముఖ్యాంశాలు ఇలా..

 • ఈ 9 ఏళ్లు నాకు మీరంతా అండగా నిలిచారు
 • అధికార పార్టీ ఎన్ని కష్టాలు పెట్టినా నాతోనే మీరంతా ఉన్నారు
 • మీరంతా ఎన్నో అవమానాలు భరించారు, లాఠీ దెబ్బలు తిన్నారు
 • ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు
 • కొంత మంది ఆస్తులను పోగొట్టుకున్నారు. మరి కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు
 • అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉంటా
 • సంక్షేమ పథకాలు అందించేటప్పుడు కులాలు చూడకూడదు
 • ప్రతి సంక్షేమ పథకం ప్రజలందరికీ అందాలి
 • మీరే ముందుండి ఆ పథకాలన్నీ అందించేలా చేస్తా
 •  విపక్ష నేతలపై అక్రమ కేసులను ఎత్తివేస్తాం
 • రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారు
 • బాబు తీరు..దొంగే దొంగ అన్నట్లుగా ఉంది
 • వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారు
 • చివరకు మా సొంత చిన్నాన్న వైయస్‌ వివేకానందరెడ్డి ఓటు కూడా తొలగించారు
 • ఎక్కడా నారా లోకేష్‌ పేరు లేదు
 • చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదు
 • కలర్‌ ఫొటోల డేటా కేవలం ఈసీ దగ్గర మాత్రమే ఉంటుంది
 • చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్‌ కంపెనీ దగ్గర ఈ డేటా కనిపిస్తోంది
 • పచ్చ మీడియా తోడుందని ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు
 • ఓ దొంగ..రాక్షసుడు..నేరగాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు
 • ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు
 • మనమంతా కలిసికట్టుగా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి
 • చంద్రబాబు ఏం చేసినా ఈ ఎల్లోమీడియాకు కనిపించదు
Back to Top