వైయ‌స్ జ‌గ‌న్‌ది ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్‌ భావజాలం 

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌
 

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్‌ భావజాలం అని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ కొనియాడారు. విజ‌య‌వాడ బీసీ స‌భ‌లో మార్గాని భ‌ర‌త్ మాట్లాడారు. వార్డు మెంబర్‌ నుంచి రాజ్యసభ వరకు బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌ది. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు.  చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మింగేస్తారు అని ఎంపీ మార్గాని భరత్‌ పేర్కొన్నారు. ప‌రిజ్ఞానం లేని లోకేష్ చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్ట‌మ‌న్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియ‌ని ద‌త్త పుత్రుడిని న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో విభజన చట్టం పెండింగ్‌ అంశాలే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెడుతున్నామ‌ని తెలిపారు. 

Back to Top