పామాయిల్‌ రైతులకు మద్దతు ధర ప్రకటించాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌

న్యూఢిల్లీ: పామాయిల్‌ రైతులకు మద్దతు ధర ప్రకటించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. తన నియోజకవర్గంలో పామాయిల్‌ రైతులు అధికంగా ఉన్నారని తెలిపారు. పామాయిల్‌ పండించే రైతులకు కేంద్రం న్యాయం చేయాలని ఆయన కోరారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పామాయిల్‌ ధరల నిర్ణయం ఉంటుందని, మద్దతు ధర ప్రకటించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ ప్రశ్నకు సమాధానం  ఇచ్చారు. 

Read Also: వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌

Back to Top