అనంతపురం: శింగణమల నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. రాచేపల్లి గ్రామానికి చెందిన 13 కుటుంబాలు అధికార టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరాయి. మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ యువ నాయకుడు డాక్టర్ రుత్విక్, పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శి గోకుల్ రెడ్డి సమక్షంలో టీడీపీ కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. టీడీపీకి రాజీనామా చేసి వైయస్ఆర్‌సీపీలో చేరిన ఈ కుటుంబాలు పార్టీ సిద్ధాంతాలు, వైయస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాలు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, వైయస్ జగన్ పాలనపై నమ్మకంతో వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో వైయస్ఆర్‌సీపీ బలోపేతం అవుతోందని, ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో మరింత బలంగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు.