లక్ష్మీనరసింహుడి సేవలో వైయ‌స్‌ జగన్ 

భూమయ్యగారిపల్లె గ్రామంలో గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం

ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన మాజీ ముఖ్య‌మంత్రి

పులివెందుల:   వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.  గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం,  ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, ఆలయంలో స్వామివారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొన్నారు. 

బండ‌లాగుడు పోటీలు ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్‌
ఆలయ కార్యక్రమం అనంతరం సమీపంలోని బండలాగుడు మైదానానికి చేరుకుని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను, నిర్వాహకులను అభినందించారు. అనంతరం  వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్ నాయకులు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Back to Top