ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించిన‌ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు

చిత్తూరు: భారీవర్షాలతో పోటెత్తిన  ముంపు ప్రాంతాల‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప‌రిశీలించారు.  వైయ‌స్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. జలదిగ్బంధంలో  చిక్కు కున్న గ్రామాల‌ను ప‌రిశీలించి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నదులు, వాగులు, వంకలు పొం గి ప్రవహిస్తున్నాయి.  కొల‌గుట్ల వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న 17 మందిని, ధ‌ర్మ‌వ‌రం చెరువులో చిక్కుకున్న 8 మందిని, చిత్రావ‌తి న‌దిలో చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ సిబ్బంది ర‌క్షించారు. పెన్నా న‌ది వంతెన కింద చిక్కుకున్న వ్య‌క్తిని కాపాడారు. తిరుప‌తి న‌గ‌రంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిలు ప‌ర్య‌టించారు.  నెల్లూరు రూర‌ల్ ముంపు ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ప‌ర్య‌టించి బాధితుల‌కు అండ‌గా నిలిచారు. కొవ్వూరు మండ‌లంలో ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ప‌ర్య‌టించారు

తాజా ఫోటోలు

Back to Top