అనంతపురం జిల్లా ప్రజల్లో భరోసా నింపిన వైయస్‌ జగన్‌ 

ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్‌
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా ప్రజల్లో భరోసా నింపుతున్నారని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ పేర్కొన్నారు. గవర్నర్‌ ధన్యవాద తీర్మానంపై ఆమె మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని జీడీపల్లె ప్రాజెక్టు నుంచి బీడీపీ ప్రాజెక్టు వరకు నీరు తీసుకెళ్తున్నారు. ఇది నిజంగా  కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఇది వరప్రసాధిని అని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ అన్నారు. గత ప్రభుత్వం చూస్తే కేవలం బీడీపీ ప్రాజెక్టు కేవలం శిలాఫలకాలకే పరిమితమైంది. అనంతపురం ప్రాంతం కరువుతో అల్లాడుతోంది. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాలు లేక, గిట్టు బాటు ధరలు లేక, పనులు లేక ఈ జిల్లా ప్రజలు వలసవెళ్తున్నారు. ఇవన్నీ కూడా సీఎం వైయస్‌ జగన్‌ గమనించి, జిల్లా ప్రజలకు భరోసా నింపారు. జిల్లాలోని చెరువులన్నీ నింపుతారని, ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేశారని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top