పవన్‌కు ఒంటినిండా తిక్క ఉంది..అతడో పిచ్చోడు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు 

పవన్‌ కళ్యాన్‌ హద్దులు మీరి మాట్లాడుతున్నారు

కులాలు, మతాల మధ్య ఘర్షణ సృష్టించేలా పవన్‌ వ్యాఖ్యలు

ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత పవన్‌కు లేదు

పవన్‌ ఇష్టారీతిగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు

పవన్‌ చంద్రబాబుకు దత్తపుత్రిడిలా వ్యవహరిస్తున్నారు

పవన్‌ చేష్టలు చూసి ఆయన ఫ్యాన్సే ఆశ్చర్యపోతున్నారు

తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఒంటినిండా తిక్కుందని, అతనో పిచ్చోడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత పవన్‌కు లేదని స్పష్టం చేశారు.  కులాలు, మతాల గురించి పవన్‌ తరచు మాట్లాడుతూ కులాలు, మతాల మధ్య ఘర్షణ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కులం లేదు..మతం లేదు అంటూనే కులం, మతం గురించి పదే పదే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. 
మా నాయకులు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అందరి వాడు..అన్ని మతాల వారిని సమానంగా చూస్తారు. మా నాయకుడికి కులం, మతం, ప్రాంతం లేదు. అందరూ కూడా తన వాళ్లే. మా నాయకుడి మతం మానవత్వం..కులం మాట నిలబెట్టుకోవడం. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల బాధలు కళ్లారా చూశారని, క్షేత్రస్థాయిలో విన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత వారి కష్టాలు తీర్చుతున్నారన్నారు. ఎస్సీలు, ఎస్టీలు మతాలు మారితే కులాలు మారవన్నారు. కమ్మ, రెడ్డిలు మతం మారితే కులం మారదన్నారు. మతం, కులం అన్న పదాలకు పవన్‌ అర్థం తెలుసుకోవాలన్నారు. వైయస్‌ జగన్‌ కులం, మతం అంటూ పవన్‌ బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిలు చేసుకున్నారు.  క్రిస్టియన్‌ అయిన రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కన్నారు. అది మీ వ్యక్తిగతం. కానీ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు పవన్‌కు కులాలు, మతాలు గుర్తు రాలేదా?. ఆయన పిల్లలు ఏ కులానికి చెందిన వ్యక్తులు, వారిది ఏ మతం?. మీ పిల్లలది మీ కులమే కదా? రష్యాన్‌ భార్యకు 2012లో పుట్టిన మీ పిల్లలకు పాస్‌పోర్టులో ఏ మతం ఉంది?. జనాభా లెక్కలు చేసే సమయంలో మీది ఏ కులమని కుటుంబ యజమానిని అడుగుతారు. ఇంట్లో కుటుంబ సభ్యులందరిని అడుగరు. ప్రపంచంలో మతం లేని వారు వంద కోట్లకు పైగా ఉన్నారని, మన దేశంలో లక్షల్లో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. రెండు లక్షల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకుంటున్న పవన్‌ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. అసలు విషయాలు తెలుసుకోవాలి. 
రాజ్యాంగం కొన్ని హక్కులు, విధులు కల్పించింది. సమాజంలో మార్పు తేవాలని మన సంస్కర్తలు రాజా రామ్మోహన్‌ రాయ్‌ దగ్గర్నుంచి వీరేశలింగం పంతులు వరకు సమాజంలో ఎన్నో దురాచారాలపై గళమెత్తారు, ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం గంటకోమాట, పూటకోమాట, రోజుకో మాట మాట్లాడి ప్రజలను తికమక పెట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో మార్పుకోరుకునే వారు పాజిటివ్‌ థింకర్స్‌గా గొప్ప గొప్ప ఆలోచనలతో ఉండాలని అన్నారు. మా నాయకుడు వై యస్‌ జగన్‌ మానవత్వమే కులంగా కలిగి ఉన్నాడు గాని, పవన్‌ మాదిరిగా చంద్రబాబు మాదిరిగా కుల రాజకీయాలు చేయరని ఉద్ఘాటించారు. గతంలో వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తాను ప్రవేశపెట్టిన పథకాల ద్వారా అన్ని కులాలకు, మతాలకు దగ్గరయ్యారని, చంద్రబాబు లాంటి కుహానా నాయకులు ఎస్సీ, ఎస్టీల మధ్య చిచ్చు పెట్టారని ఆయన గుర్తుచేశారు. మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడు అయిన వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దేశంలో ఎవ్వరూ చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. కేవలం 100 రోజుల్లోనే మేనిఫెస్టోను దాదాపుగా పూర్తిచేసిన ఘనతను ప్రజలు గుర్తించాలన్నారు. చంద్రబాబు పెంపుడు కుక్కగా చెప్పబడే పవన్‌ నాయుడు మాత్రం ఒకరోజు మోడీని, అమిత్‌ షా లను తిడతాడు.. తర్వాత రోజే పొగుడుతాడు అని అన్నారు. ఒక రోజు మహిళలపై అత్యాచారాలు చేసేవారిని కత్తితో చంపాలంటాడు, మరునాడే ఎలా చంపుతారు, బెత్తం దెబ్బలు చాలు అంటాడు. ఆయన మాట్లాడేది విని ఆయన అభిమానులు కూడా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో, ప్రజా క్షేత్రంలో ఉన్న నాయకుల మాటలు సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను ఏం చేస్తున్నారో గమనిస్తూనే ఉంటారని, ప్రతిపక్షం అంటే ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి సరిచేయమని చెప్పాలే కాని.. ఎప్పుడూ కులం, మతం అంటూ మాట్లాడటం సబబుకాదన్నారు. ఇంకా పవన్ మాటలు, చేష్టలు, ఆవేశం చూస్తుంటే పిచ్చి పీక్స్‌ కు చేరినట్లుగా ఉందని అన్నారు. ఇకనుంచి అయినా పవన్‌ తన దత్త తండ్రి చంద్రబాబు చెప్పినట్లు కాకుండా ఆయన వెంట ఉన్న కొంత మందికి అయినా నచ్చేటట్లు మాట్లాడాలని హితవు పలికారు. అత్యధిక మెజారిటీతో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, తక్కువ వయసులోనే మంచి పేరు తెచ్చుకుంటున్నారన్న బాధ, కుళ్లు చంద్రబాబులో కనిపిస్తున్నాయన్నారు. మారుతున్న సమాజంలో మంచి మెసేజ్‌ ఇవ్వాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ రకరకాలుగా మాట్లాడుతున్నారని, ప్రియాంకరెడ్డి ఘటనపై, తన అక్కపై జరిగిన ఘటనలపై చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నారు. దయచేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాలని పవన్‌ కళ్యాణ్‌కు సూచించారు.  పవన్‌ కళ్యాణ్‌ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని శ్రీనివాసులు హెచ్చరించారు. 

Read Also: హెచ్‌ఆర్‌డీ నిబంధనను ఉపసంహరించుకోవాలి

తాజా ఫోటోలు

Back to Top