హెచ్‌ఆర్‌డీ నిబంధనను ఉపసంహరించుకోవాలి

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
 

రాజ్యసభ: ఉన్నత విద్య చదివే విద్యార్థులకు బ్యాంకు రుణాలపై హెచ్‌ఆర్‌డీ నిబంధనలపై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపు వర్సిటీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే బ్యాంకు రుణాలు ఇవ్వాలన్న నిబంధన ఉపసంహరించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. గుర్తింపు ఉన్న వర్సిటీలు, ఐఐటీ విద్యార్థులకు వందశాతం ప్లేస్‌మెంట్‌ దొరుకుతున్నాయన్న వాదనలో నిజం లేదన్నారు. హెచ్‌ఆర్‌డీ నిబంధనను ఉపసంహరించుకోవాలని, స్టేట్‌స్‌ కో అమలు చేయాలన్నారు. నాలుగున్నర లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే రుణాలు అందిస్తామన్న నిబంధన రద్దు చేయాలని కోరారు. 
 

Read Also: జైళ్ల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష 

Back to Top