రాజమండ్రిలో వినూత్నంగా ముంద‌స్తు పుట్టిన రోజు వేడుకలు

తూర్పుగోదావరి: రాజమండ్రిలో వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో 40 వేల అడుగుల వైయ‌స్‌ జగన్‌ భారీ ఫ్లెక్స్‌ను  పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ  ఏర్పాటు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత జక్కంపూడి రాజా, వినయ్‌ తేజ వైయ‌స్‌ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  గోదావరిలో పడవలను అలకరించిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు.. సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైయ‌స్‌ జగన్‌ జన్మదిన వేడుకల్లో కక్‌ కట్‌ చేసి  పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని ముంద‌స్తు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు.

Back to Top