మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద టీడీపీది పిడివాదం

ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

కోటి సంతకాల సేకరణకు వెల్లువెత్తిన ప్రజలు

ఇదే ప్రజాభిప్రాయానికి నిదర్శనం

స్పష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి

న్యూఢిల్లీ నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, స్టాండింగ్ కమిటీ రిపోర్టుపై  వీడియో విడుదల చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి.

పేదవాడి ఇంటి వరకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు  

జిల్లాకో టీచింగ్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ స్ధాపనే వైయస్.జగన్ లక్ష్యం

అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం.

అధికారంలోకి రాగానే  పనులు నిలిపివేసిన కూటమి ప్రభుత్వం

ప్రజారోగ్యాన్ని తుంగలో తొక్కి వైయ‌స్ఆర్‌సీపీపై దుష్ప్రచారం

ప్రైవేటీకరణకు అనుకూలంగా సంతకం చేశామంటూ అబద్దాలు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎంపీ గురుమూర్తి

ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ లో ఫీజు రూ.1350

లక్నో కేజీఎమ్ యూ లో ఏడాది ఫీజు రూ.24 వేలు

పూణే డీ వై పాటిల్ విద్యా పీఠ్ లో రూ.26.50 లక్షలు

తన నివేదికలో పొందుపరిచిన స్టాండింగ్ కమిటీ

ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల ఫీజుల్లో భారీ తేడా

ఈ అంశాలు టీడీపీ నేతలకు కనిపించడం లేదా?

సూటిగా ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

వేదిక ఏదైనా వైయ‌స్ఆర్‌సీపీదీ ప్రజాపక్షమే

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు మేం పూర్తిగా వ్యతిరేకం

ఇప్పటికైనా మీ విధానం మార్చుకొండి

ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగించండి

స్పష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి

న్యూఢిల్లీ:  మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద అధికార తెలుగుదేశం పార్టీ పిడివాదం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవైటీకరణ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని... వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో వెల్లువెత్తిన ప్రజాభిప్రాయమే అందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీ నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, స్టాండింగ్ కమిటీ రిపోర్టుపై  వీడియో విడుదల చేసిన ఆయన... పేదవాడి ఇంటి వరకు సూపర్ స్పెషాలిటీ సేవలు  అందించాలన్న సదుద్దేశంతోనే...  జిల్లాకో ఆసుపత్రి, మెడికల్ కాలేజీ స్థాపించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ 17 మెడికల్ కాలేజీలు స్థాపనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అయితే అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని తుంగలో తొక్కి.. తిరిగి ప్రైవైటీకరణకు అనుకూలంగా సంతకం చేశారంటూ వైయ‌స్ఆర్‌సీపీ పై దుష్ప్రచారం చేయడంపై గురుమూర్తి మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ లో ఏడాది ఫీజు రూ.1350 ఉండే, ప్రైవేటు కాలేజీల్లో రూ. 1.50 కోట్లు వరకు వసూలు చేస్తున్నారని స్టాండింగ్ కమిటీ నివేదికలో పొందుపరిచిన విషయం టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. వేదిక ఏదైనా వైయ‌స్ఆర్‌సీపీదీ ఎప్పడూ ప్రజాపక్షమే అని తేల్చి చెప్పిన ఆయన... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం.. తన విధానం మార్చుకొని, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

టీటీపీది పిడివాదం- అసత్య ప్రచారం...

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణమీద అధికార తెలుగుదేశం పార్టీ తన పిడివాదాన్ని, అబద్దాలను ప్రజల మీద  రుద్ది అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అందుకు నిదర్శనంగానే దాదాపుగా  కోటి  మందికి పైగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసనగా సంతకాలు చేశారు. వైస్.జగన్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంచడంతో పాటు, నాణ్యమైన వైద్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించడంతో పాటు, ఎంతోమంది డాక్టర్ చదవాలన్న విద్యార్ధుల కల నెరవేర్చాలని, మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు మన దగ్గరే వైద్య విద్య చదవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల స్థాపనకు వైయస్.జగన్ ముందుకు వచ్చారు. 

పేదవాడికి సూపర్ స్పెషాలిటీ  వైద్యం మా లక్ష్యం...

ప్రతి జిల్లాలోనూ ఒక ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఉండాలని ప్రభుత్వమే అత్యాధునిక సదుపాయాలతో లండన్ లో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్ ను  ఒక మోడల్ గా తీసుకుని... సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి గ్రామస్ధాయిలో ఉన్న ఒక పేదవాడి ఇంటి వరకూ  అందాలన్న ఉద్దేశంతోనే వైద్య విధానాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా సంస్కరణలు తీసుకొచ్చారు. ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు అన్ని రకాల సేవలు ప్రతి మారుమూల పల్లెకు చేరాలన్న ఉద్దేశంతో 17 కాలేజీల స్థాపనకు శ్రీకారం చుట్టారు. వీటిలో కొన్నింటికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తే.. మిగిలిన అన్ని కాలేజీలకు నాబార్డు వంటి సంస్దలతో ఆర్ధిక సహకారం తీసుకుని త్వరితగతిన కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా 3 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తై వాటికి కేంద్ర ప్రభుత్వం మెడికల్ సీట్లు కేటాయిస్తే... సీట్లు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే వద్దని కేంద్రానికి చెప్పింది. అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసింది.

స్టాండింగ్ కమిటీ పేరుతో మా పై దుష్ప్రచారం...

వీటన్నింటినీ తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం తిరిగి మా పై దుష్ప్రచారం చేస్తుంది. ఢిల్లీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు అనుకూలంగా వైయ‌స్ఆర్‌సీపీ స్టాండింగ్ కమిటీలో సంతకం పెట్టి.. గల్లీలో దాన్న వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నామని మాపై అసత్యాలు ప్రచారం చేస్తోంది. స్టాండింగ్ కమిటీ రిపోర్టులో ఏమేం చెప్పారో పూర్తిగా చూడలేదు. ప్రైవేటు కాలేజీల్లో పూర్తిస్థాయి ఫ్యాకల్టీని నియమించుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుందని.. చాలా ప్రైవేటు కాలేజీల్లో ఈ ఖర్చు తగ్గించుకోవడానికి సరైన ఫ్యాకల్టీని నియమించుకోవడం లేదు. అదే విధంగా స్టూడెంట్స్ హాజరు తక్కువగా ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుని అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దాంతో పాటు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న న్యూఢిల్లీ ఎయిమ్స్ లో ఫీజు రూ.1350 అయితే, కేజీఎమ్యూ, లక్నో స్టేట్ ఇనిస్టిట్యూట్ లో  అయితే అదే ఫీజు రూ.24వేలు వసూలు చేస్తుండగా... డీ వై పాటిల్ విద్యా పీఠ్ పూణేలో రూ.26.50 లక్షలు ఏడాదికి వసూలు చేస్తున్నట్టు ఇదే స్టాండింగ్ కమిటీ రిపోర్టులో పొందుపరుస్తే.. ఇవన్నీ ఎందుకు టీడీపీ నేతలకు కనిపించడం లేదు. దీనిలో చాలా స్పష్టంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలలో ఫీజు తక్కువగానూ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో దాదారు రూ.60 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్టు స్టాండింగ్ కమిటీ రిపోర్టులో ఉంటే అది కనిపించడం లేదా? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించమని ఏ స్టాండింగ్ కమిటీ చెప్పలేదు. 2020-24 వరకు పార్లమెంట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో నేను సభ్యుడిగా ఉన్నాను. స్టాండింగ్ కమిటీ దృష్టికి  రకరకాల అంశాలు వస్తాయి. వాటిపై కూలంకషంగా చర్చిస్తారు. కమిటీ సభ్యులు దేనికీ అనుకూలంగా రాయరు. కేవలం వారి అభిప్రాయాలను మాత్రమే వెల్లడిస్తారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అప్పుడు కూడా నేను నా అభిప్రాయాన్ని వెల్లడించాను. ప్రైవేటీకరణ వల్ల విద్యార్ధుల కుటుంబాల పై ఆర్ధిక భారం పడుతుంది. పేదలు అంత ఖరీదైన ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య,ఆరోగ్యం ఉంటే బాగుంటుందని చెప్పాను. 

వేదిక ఏదైనా మాది ప్రజాపక్షమే..

స్టాండింగ్ కమిటీ కేవలం సలహాలు మాత్రమే ఇస్తుంది. ఈ కమిటీ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే సమస్యకు పరిష్కారం అని ఎక్కడా చెప్పలేదు. స్టాండింగ్ కమిటీ తన నివేదికలో ప్రజల ఆరోగ్యం, విద్య అనేవి ప్రభుత్వ బాధ్యత అని చెప్పింది. నాలెడ్జ్ షేరింగ్, స్కిల్ అప్ కోసం ప్రైవేట్ సేవలు వాడుకోవాలని చెప్పిందే తప్ప...  ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేసి తద్వారా కొద్దిమందికి లబ్ధి చేకూర్చమని ఎక్కడా చెప్పలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమే. వైయస్.జగన్ నేతృత్వంలో ప్రజలకు మంచి చేయాలన్నదే మా పార్టీ విధానం. ఆయన ఆలోచనలకు అనుగుణంగా మేమంతా నడుచుకుంటాం. వేదిక ఏదైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తూనే ఉంటాం. వైయ‌స్ఆర్‌సీపీతరపున ప్రైవేటీకరణను వ్యతిరేకంగా నేను స్వయంగా పార్లమెంటులో మాట్లాడాను. 
ఇవాళ అన్ని వేదికలను చూసి ప్రజలు ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడాలన్నదే నా విజ్ఞప్తి. అంతే తప్ప ప్రైవేటీకరణలో భాగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మి.. మీ వాళ్లకు మేలు జరిగితే అందరికీ మేలు జరిగినట్టు కాదు. 
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తన శాఖమీద దృష్టి సారించి.. అనవసర విషయాలమీద మాటలు తగ్గిస్తే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి, ఏలూరు, నంద్యాల మెడికల్ కాలేజీలకు అసిస్టెన్స్ ఇచ్చింది.. ఇవి కాకుండా మిగిలిన 14 మెడికల్ కాలేజీలకు కూడా కేంద్ర సాయం కోసం ప్రయత్నించకుండా.. మంత్రి రాజకీయ ప్రకటనలకు పరిమితం కావడం సరికాదని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.

Back to Top