తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ సంస్థాగత నిర్మాణం అత్యంత బలంగా చేపట్టేలా కార్యాచరణ కొనసాగుతోందని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో కమిటీల నియామకం పూర్తయ్యిందన్నారు. 21న రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కడప, పుంగనూరు, మడకశిర, వేమూరు అసెంబ్లీ నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘పార్టీ గ్రామస్థాయి నిర్మాణం పటిష్టంగా జరగాలని అధ్యక్షులు వైయస్ జగన్ సూచించారు. దాని ప్రకారం పూర్తి చేసిన తొలి 10 నియోజకవర్గాలకు సంబంధించి 21న సమావేశం రచ్చబండ పేరుతో జరుపుతున్నాం. అందులో మిగిలినవి ముందే అయిపోయినా, కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు తొలిసారి జరుగుతున్నాయి. దాంట్లో క్రియాశీలకంగా పాల్గొని పూర్తి చేసిన పార్టీ కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డికి అభినందనలు. ముఖ్యంగా మడకశిర అన్నింటికంటే ముందే అయ్యింది. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు అయ్యింది. దాని తర్వాత వేమూరు కంప్లీట్ అయ్యింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్.. కడప పార్లమెంటులోనే పూర్తి చేద్దామని పిలుపునివ్వడంతో వాళ్లు కూడా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సాహంగా చొరవ చూపించి ఇనీషియేటివ్ తీసుకున్నారు. ఒక పార్లమెంటు మొత్తం ఒకేసారి ఏకబిగిన జరిగింది. కమిటీలు రాష్ట్రంలో చాలా చోట్ల అయ్యాయి. ఒక పద్ధతి ప్రకారం ముందు అవగాహన సదస్సు పెట్టి, పరిశీలకులను పెట్టి, సోషల్ మీడియాకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ పరిశీలకులను పెట్టి అంచలంచెలుగా అవగాహన సదస్సులు పెట్టి యజ్ఞంలాగా చేశాం. కడప పార్లమెంటుకు సంబంధించి 80 రోజుల్లోపూ పూర్తి చేశాం. ఇలా చేయడం వల్ల పార్టీ తొలిసారిగా సంస్థాగత నిర్మాణం జరిగింది. లీడ్ చేసింది ఈ 10 నియోజకవర్గాలే. అందరికీ అభినందనలు. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ప్రోత్సాహం చెప్పుకోదగ్గది. క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ పార్టీ నిర్మాణం పటిష్టంగా అయితే, క్షేత్రస్థాయిలో బలమైన నెట్ వర్క్ ఏర్పాటైతే.. భవిష్యత్తులో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కింది స్థాయిలో ఏది చేయాలన్నా, వాళ్ల ద్వారా చేయడం, లేదా ఇన్వాల్వ్ చేయడం కోసం పటిష్టమైన నాయకత్వం రికార్డు అయి ఉంటుంది. పార్టీ అధినేత నేరుగా కనెక్ట్ అయ్యేందుకు, ఇక్కడ సెంట్రల్ ఆఫీసులో కూడా డేటా అందుబాటులో ఉండేందుకు, ఇన్సూరెన్స్, ఐడీ కార్డులు అందించేందుకు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పదవులు ఇచ్చేటప్పుడు ప్రయారిటీ తెలుస్తుంది. డేటా అంతా నమోదు చేయడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యాచరణ చేపట్టాం. దీనివల్ల కమిటీల్లో ఉన్న వారికి ఉపయోగం, ఆ విభాగానికి ఉపయోగం ఉంటుంది. పార్టీ అధినేత ప్రసంగాలు, ప్రెస్ మీట్లలో మాట్లాడినా, ఇక్కడ సీనియర్ లీడర్లు మాట్లాడినా, చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టాలన్నా, మన ప్రభుత్వంలో చేసిన మంచి పనులను చెప్పాలన్నా అన్నింటికీ ఎక్కడికక్కడ చేరవేయొచ్చు. ప్రజల్లోకి వెళ్లేందుకు సులభంగా ఉంటుంది. దానికి అవసరమైన మీడియా బ్యాకప్ సిద్ధం చేస్తున్నాం. అందులో భాగంగానే కమిటీలు పెట్టాం. కమిటీలు యాక్టివిటీ లేకపోతే ఉపయోగం ఉండదు. కమిటీల మీటింగులు జరగాలి, తీర్మానాలు పాస్ చేయాలి, పలు అంశాలను చర్చించాలి, ఈ తీర్మానాల గురించి మీకు కూడా వివరించాం. పొలిటికల్, స్టేట్ ఇష్యూస్, గ్రామ, మండల తదితర ఇష్యూస్ పై తీర్మానాలు చేయాలి. సోషల్ మీడియా గ్రూపుల్లో వెళ్లాలి. వైయస్ జగన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహిద్దాం 21న మన అధ్యక్షులు వైయస్ జగన్ బర్త్ డే ఘనంగా నిర్వహిద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించిన తీరు, చంద్రబాబు దుర్మార్గ విధానాలపై తీర్మానం, గవర్నర్ కు మెమొరాండం ఇచ్చినది ఆయా కమిటీల సమావేశం సందర్భంగా తీర్మానం చేయాలి. స్థానిక సమస్యలు పెట్టాలి. ఉపాధి హామీని మార్పు చేసి చట్టం చేయడం వల్ల గ్రామాల్లో ప్రభావం పడుతోంది కాబట్టి, పేద కూలీలకు జరిగే నష్టం గురించి తీర్మానం చేయాలి. రైతాంగం సమస్యలు, మద్దతు ధర లేకపోవడం, ఎరువులు, విత్తనాలు లేకపోవడం లాంటివాటిపై చేర్చవచ్చు. సోషల్ మీడియా వేదికలు వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా యాక్టివ్ గా ఉండేవారిని గుర్తించి షేర్ చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. నియోజకవర్గ ఇన్ చార్జులు ఇనీషియేట్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మూడు నాలుగు నెలలు మీటింగులు జరగాలి. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ చార్జులు ఐదారుసార్లు సమావేశాలు నిర్వహిస్తే అదే గాడిలో పడుతుంది. యాక్టివిటీ కంటిన్యూ చేయాలి. ఫొటోలు తీసుకుని, తీర్మానాల కాపీలను కేంద్ర కార్యాలయానికి పంపాలి. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడి నుంచే వచ్చే ’ప్రజా సంకల్పం‘ బులెటిన్ లో ఆ వివరాలను పబ్లిష్ చేయొచ్చు.’’ అని సజ్జల తెలిపారు.