ముందుగా పవన్‌ను ఎంపీటీసీగా గెలవమనండి

బీజేపీ-జనసేన పొత్తు అనైతికం

2024లో అధికారంలోకి వస్తామనడం పగటి కలే 

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ ముందుగా ఎంపీటీసీగానో, సర్పంచ్‌గానో గెలవాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సూచించారు. బీజేపీ-జనసేన పొత్తుపై ఎమ్మెల్యే స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే..మాకు, ఆ కుటమికి వచ్చిన తేడా ఒకటిన్నర ఓట్ల శాతం మాత్రమే. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఒకటిన్నర శాతం, జనసేనకు ఐదు, ఆరు శాతమే వచ్చింది. ముందు పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో గెలవమని చెప్పండి. 2024లో అధికారంలోకి వచ్చేది దేవుడెరుగు. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావాలని కోరుకోవడంలో సహజం. దానికన్న ముందు నాయకుడన్నవారు గెలవాలి కదా? ఇవన్నీ వినడానికి బాగుంటాయి. ఇవేవి కొత్త కలయిక కాదు. పవన్‌ 2014లో పార్టీ పెట్టినప్పుటి నుంచి బీజేపీకి, టీడీపీకి ప్రేయసిగా ఉన్నారు. బీజేపీ, టీడీపీ మధ్యలో గ్యాప్‌ వచ్చింది కాబట్టి..దాన్ని కవర్‌ చేసేందుకు చంద్రబాబే పవన్‌ను బీజేపీ వద్దకు పంపించి ఉంటారని అనుమానంగా ఉంది. ఎన్నికల్లో ఎలాగు పవన్‌ గెలవలేరు కాబట్టి రాజ్యసభ ఎంపీ, లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీ నడిపే వ్యక్తికి సిద్ధాంతాలు చాలా ముఖ్యం. వ్యక్తిత్వం అన్నది ముఖ్యం. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా పవన్‌కు లేవు. ఇటువంటి పరిస్థితిలో వాళ్లు పగటి కలలు కనడం సహజం కాదు. పవన్‌ను ఎక్కడైనా ఎంపీటీసీగానో, సర్పంచ్‌గానో పోటీ చేసి గెలవమనండి. బీజేపీ, జనసేనవి అనైతిక పొత్తులు. పవన్‌కు ఎక్కడా కూడా నైతిక హక్కు లేదు. కమ్యూనిస్టులతో కలిసి గతంలో పోటీ చేసిన పవన్‌ ..ఇల్లీగల్‌ పొత్తులు పెట్టుకున్నారు. ఆ రోజు పాచిపోయిన లడ్డులు అని చంద్రబాబు చెబితే పవన్‌ తిట్టారు. ఈ రోజు చంద్రబాబును కాపాడుకునేందుకు మళ్లీ బీజేపీతో కలిసి పవన్‌ ముందుకు వెళ్తున్నారు. కులతత్వం, మతతత్వ రాజకీయాలను రాష్ట్రంలో ప్రజలు నిర్మూలించారు. 
 

Back to Top