తాడేపల్లి: ఇండియన్ ముస్లింలీగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ భాషా ఈరోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి తమ సంపూర్ణ మద్దతు వైయస్ఆర్‌సీపీకి ఇస్తామని తెలియచేశారు. ముస్లింలకు రక్షణ వైయస్ఆర్‌సీపీతోనే సాధ్యమని తాము మనస్పూర్తిగా నమ్ముతున్నట్లుగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా షేక్ హుస్సేన్ భాషా మాట్లాడుతూ ..బిజేపితో కూటిన తెలుగుదేశం,జనసేన కూటమి ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.బిజేపి తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నప్పటికి చంద్రబాబు ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు.పైగా తమ భాగస్వామి అయిన బిజేపి మాటలను కనీసం ఖండించడం లేదని తెలియచేశారు. ఈ నేపధ్యంలో ముస్లింలకు భరోసా ఇస్తామని అండగా ఉంటామని ప్రకటించిన వైయస్ జగన్ మాటలను తాము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మధ్దతు ప్రకటిస్తున్నట్లు వివరించారు.