నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని ఎల్‌వీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శిల్పా చక్రపాణి రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఆత్మకూరు, వెలుగోడు మండలాలకు చెందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మరియు ఆత్మకూరు టౌన్ కౌన్సిలర్లకు ఈ సందర్భంగా సన్మానం చేశారు. ప్రజా ప్రతినిధుల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధి, ప్రజలకు సేవలందించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. భవిష్యత్‌లో కూడా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సన్మానితులైన కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తమకు అందించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కుందూరు శివారెడ్డి, పట్టణ ,మండల అధ్యక్షులు సయ్యద్‌మీర్, రామ్మోహన్‌రెడ్డి, రేనాటి ఎల్లారెడ్డి, మార్త భాస్కర్, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.