అల్లూరి జిల్లాలో బాలికల మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం

తాడేప‌ల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి బాలికలు మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి భవిష్యత్తు కోసం కలలు కంటున్న ఈ విద్యార్ధులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

Back to Top