కాసు బ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయం

నరసరావుపేటలో బ్ర‌హ్మానంద‌రెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

ప‌ల్నాడు జిల్లా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నరసరావుపేటలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కాసు మ‌హేష్‌రెడ్డి, డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి, త‌దిత‌రులు కాసు బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన ప్రజాసేవలను స్మరించుకున్నారు.

దేశ రాజకీయాల్లో విశిష్ట ముద్ర వేసిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు పరిపాలనలో దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.
 

Back to Top