తాడేపల్లి: టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఇవాళ టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం. నేడు టంగుటూరి ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు.