కాకినాడ: జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ కమిటీల నియామకం, సంస్థాగత బలోపేతంపై కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్లతో విస్తృతంగా చర్చించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించడం, రాబోయే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వంగా గీతా, దవలూరి దొరబాబు, ముద్రగడ గిరి, తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని నాయకులు సూచించినట్లు తెలిసింది.