రైతాంగ అభ్యున్నతికి కృషి చేసిన దార్శనికుడు

కాసు బ్రహ్మానందరెడ్డి వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళి

తాడేప‌ల్లి: నాగార్జునసాగర్ వంటి మహత్తర ప్రాజెక్టులకు బాటలు వేసి, రైతాంగం అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప దార్శనికుడు కాసు బ్రహ్మానందరెడ్డి అని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల్లో విశిష్ట నాయకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమ‌న్నారు. అభివృద్ధి, పరిపాలన, ప్రజాసేవల పట్ల ఆయన చూపిన నిబద్ధత నేటి తరాలకు ఆదర్శప్రాయమ‌ని పేర్కొన్నారు. నేడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Image

Back to Top