తాడేపల్లి: తెలుగు సాహిత్య సరస్వతీ పీఠంపై అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.అక్షరాలకు ఆత్మనిచ్చిన మహాకవి అంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. సమాజానికి సందేశం ఇచ్చేలా, యువతకు స్ఫూర్తినిచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. భావానికి భాషను, భాషకు భావోద్వేగాన్ని జోడించిన ఆయన కలం తెలుగు సినీ సాహిత్యానికి అపూర్వమైన గౌరవాన్ని తీసుకొచ్చింది. నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.