పేదల సంక్షేమాన్ని ఆపడం ధర్మం కాదు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ 

చంద్రబాబు కుట్రలకు ఈసీ వంతపాడటం అన్యాయం.

ఈసీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం: మంత్రి బొత్స సత్యనారాయణ. 
 
చంద్రబాబు పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఈ నిబంధనలు అడ్డురాలేదా?

కూటమిలో ఉంటే ఒక మాట..లేకపోతే మరో మాటా?

పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లకూడదనే కూటమి కుట్ర:

పొరపాటున కూటమి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఇక పేదవాడు బతుకుతాడా?

చంద్రబాబునాయుడిని భగవంతుడు కూడా క్షమించడు.:  మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ. 

కడుపుకు అన్నం తినే ఏ నాయకుడైనా అలాంటి ప్రకటనలు ఇస్తాడా?

ఎన్నికల కమిషన్‌ మీ భూమి మీది కాదన్న ప్రకటనకు ఏం సమాధానం చెప్తుంది?

నీ ఇంట్లో నాలుగు పదవులు లేవా చంద్రబాబూ?

ఏ ఎండకు ఆ గొడుకు పట్టుకునే బతుకు నీదే బాబూ..

నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నీ శుంఠ కొడుకునే గెలిపించుకోలేకపోయావ్‌..

నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే నేను ఎంపీగా గెలిచాను.

మీ పనైపోయిందో..నా పనైపోయిందో జూన్‌ 4 నాడు తెలుస్తుంది.:  మంత్రి  బొత్స సత్యనారాయణ.  

విశాఖ‌: పేదల సంక్షేమాన్ని ఆపడం ధర్మం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీ నీచమైన ఆలోచనతో చేసిన ఫిర్యాదుల మూలంగా.. ఈసీ వాళ్ల వత్తిళ్లకు లొంగి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. శుక్ర‌వారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

అభాగ్యులపై ఎందుకంత కక్ష? ఈ చర్యలు వారి ఉసురుపోసుకోవడమే కాదా?:
– ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ఇస్తున్న పథకాలు విద్యాదీవెన, చేయూత, ఇన్‌పుట్‌సబ్సిడీ, ఈబీసీనేస్తం వంటివి సకాలంలో అందాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. 
– మొన్న కూడా అంతే చేశారు. పింఛన్లపై ఫిర్యాదు చేసి 38 మందిని పొట్టనపెట్టుకున్నారు.
– తెలుగుదేశం పార్టీ నీచమైన ఆలోచనతో చేసిన ఫిర్యాదుల మూలంగా.. ఈసీ వాళ్ల వత్తిళ్లకు లొంగి నిర్ణయం తీసుకుంది.
– దానికి బాధ్యులు తెలుగుదేశం పార్టీ...వారి కూటమి మాత్రమే.
– ఆ అభాగ్యులపై ఎందుకంత కక్ష? ఈ చర్యలు వారి ఉసురుపోసుకోవడమే కదా? 
– చేయూత కార్యక్రమానికి ఇంకా రూ.1600 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దానికి అడ్డుపెట్టారు.
– ఆన్‌ గోయింగ్‌ అవుతున్న ప్రోగ్రాంకి ఎన్నికల కమిషనర్‌ అడ్డుపెట్టారు.
– ఇది న్యాయం కాదని మేం ఎన్నికల కమిషన్‌కు విన్నవించాం. ఇప్పటికే నిధులు కొంత విడుదల కూడా చేశాం..ఆన్‌గోయింగ్‌ ప్రోగ్రాం అని చెప్పాం.
– ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తున్నాం అని చెప్తూనే ఉన్నారు.
– మార్చి నెలలో ప్రారంభించి..ఏప్రిల్‌ నెలలో డబ్బంతా సర్ధుబాటు చేసుకుని విడుదలకు సిద్ధమై..అనుమతివ్వమని కోరాం.
– ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అంతే. రేపు వ్యవసాయ సీజన్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడిస్తేనే వారికి ఉపయోగంగా ఉంటుంది.
– దాని మీద కూడా ఫిర్యాదు చేసి దాన్నీ ఆపేశారు.
– ఈబీసీ నేస్తం పథకానికీ అడ్డుపెట్టారు. విద్యాదీవెన పథకాన్నీ అడ్డుకున్నారు. 
– వీటన్నిటిపై రాష్ట్ర ఎన్నికల అధికారులను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని పలు మార్లు వినతులు ఇచ్చినా కాలయాపన చేస్తూ చివరికి నో అన్నారు.

తీవ్రమైన పరిణామాలంటూ అధికారులను బెదిరించడం ఎంతవరకూ సమంజసం?:
– దీంతో కోర్టుకు వెళ్లి ఆ నిధులు విడుదల చేసేందుకు ఆర్డర్‌ తీసుకొచ్చాం.
– మళ్లీ ఈ రోజు ఉదయం నుంచీ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అంటూ అధికారులను బెదిరిస్తున్నారు. 
– ఉదయం క్లారిఫికేషన్‌ అడిగితే పంపాం...మళ్లీ సాయంత్రం క్లారిఫికేషన్‌ అడిగారు. అదీ పంపాం. 
– వీళ్ల తీరు చూస్తుంటే కేవలం కోర్టు ఇచ్చిన ఒక్క సమయం మించిపోయేలా చేసేందుకే ఇలా చేస్తున్నారని భావించాల్సి వస్తోంది.
– ఇంత దౌర్భాగ్యంగా పేద వాడి బతుకుతో ఆటాడుకుంటోంది టీడీపీ. మళ్లీ వీళ్లకు ఓటేయాలట!
– ఇప్పుడే పేదవాళ్లని ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే పొరపాటున కూటమి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఇక పేదవాడు బతుకుతాడా?
– ప్రభుత్వాలపై ఆధారపడుతున్న పేద జీవితాలు కష్టాలతోనే కొనసాగించగలరా?
– రాష్ట్ర ప్రజలారా...వీరు ఎంత నీచంగా ఆలోచన చేస్తున్నారో ఒక సారి గుర్తించండి.
– రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థుల పట్ల వీళ్లకి ప్రేమే లేదు.
– 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇచ్చిన రైతు మిత్ర కార్యక్రమాన్ని మ్యాచింగ్‌ గ్రాంట్‌ కలిపి ఇక్కడ చంద్రబాబు కూడా ఇచ్చాడు. 
– దాన్ని ఏ విధంగా నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత అనుమతించారు?
– చంద్రబాబు ప్రభుత్వం పసుపు కుంకుమ ఎప్పుడిచ్చారు? ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాతే కదా?
– మరి వాటికి అనుమతి ఇచ్చినప్పుడు ఈ పథకాలను ఎందుకు అనుమతి ఇవ్వరు?
– అంటే మీతో కూటమిలో ఉంటే ఒక మాట..లేకపోతే మరో మాటా?
– 2014, 2019లో ఇలాంటి అన్‌గోయింగ్‌ ప్రోగ్రాంలకు అనుమతిచ్చారు కదా? ఇవాళే ఎందుకు సమస్య వచ్చింది? 

పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లకూడదనే కూటమి కుట్ర:
– అసలు వీళ్లకు పేదవారిపై ప్రేమ ఉందా? చంద్రబాబు వ్యవసాయం దండుగ అన్న కాన్సెప్ట్‌కి ఇది నిదర్శనం. 
– పేదవాడకి ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లకూడదు..అన్నమో రామచంద్రా అని అలమటించాలనేదే వారి భావన. 
– డబ్బున్న వాళ్లకు మాత్రం అన్నీ జరుగుతూనే ఉంటాయి.
– ఛీ..ఛీ..ఏం బతుకో నాకు అర్ధం కావడం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– ఈసీపై కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం. మా నిరసన తెలుపుతున్నాం.
– ఇది ధర్మం కాదు..నిష్పక్షపాతంగా ఉండాలి తప్ప వత్తిళ్లకు లొంగి ఇలా చేయడం సబబు కాదు.
– వాళ్లు మాకు ఫిర్యాదులొచ్చాయి..అందుకే ఈ చర్యలు అంటున్నారు.
– ఆ ఫిర్యాదుల్లో ఎంత గ్రావిటీ ఉంది..దీనిలో రాజకీయ లబ్ధి ఏమైనా ఉందా అనేది పరిశీలించాలి.
– నిర్ణయం తీసుకునే ముందు ఎవరు నష్టపోతున్నారనేది చూడాలి.
– ఫిర్యాదులు చేసే వారు ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. వారి నైజం అది.
– చంద్రబాబునాయుడిని భగవంతుడు కూడా క్షమించడు.
– దేవుడు తప్పు చేస్తే..ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాడు.
– అందుకే నేను ముందే చెప్పాను..టీడీపీ ఎన్నికల తర్వాత పూర్తిగా తుడుచుపెట్టుకుపోతుందని.
– ఇలాంటి వెదవపనులు చేస్తే ఎవరు మాత్రం హర్షిస్తారు?
– పేదలకు అన్యాయం చేసి వారి పొట్టకొడితే అనుభవించక తప్పదు.
– ఈ ఎన్నికల తర్వాతైనా మేమే వస్తాం..ఈ నిధులు ఇస్తాం. 
– కానీ ఈ రోజు ఒకటో తేదీన పింఛన్‌ వస్తే లబ్ధిదారులకు ఊర్లో ఎంత గౌరవం ఉంటుంది?
– చేయూత వస్తే ఆ మహిళ ఎంత ఆనందంగా ఉంటుందో గమనించాలి.
– ఆ రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తే మరో పంట వేసుకుని హాయిగా ఉంటాడు కదా? 
– విద్యార్థులకైతే మరీ ఇబ్బందిగా ఉంది. ఫైనలియర్‌ ఔట్‌ గోయింగ్‌ స్టూడెంట్స్‌ ఇబ్బంది పడాల్సిన పరిస్తితి.
– ప్రైవేటు యాజమాన్యాలు ఫీజు కట్టకపోతే పరీక్షలకు కూర్చోబెట్టని వైనం ఉంది.
– విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ధర్మమా? 
– అసలు ఏం బతుకు ఇది చంద్రబాబు? ఈ ఎన్నికల్లో మీరు తీసుకున్న స్టాండ్‌ ఎంత నష్టం కలిగిస్తుందో గమనించారా?

కడుపుకు అన్నం తినే ఏ నాయకుడైనా ఇలాంటి ప్రకటనలు ఇస్తాడా?:
– ఈ రోజు మీ భూమి మీది కాదు అని ఒక యాడ్‌ ఇచ్చారు.
– రోజూ కడుపుకు అన్నం తినేవాడైతే, ఏ పార్టీ అయినా సరే రాజకీయ జీవితంలో ఉన్న వాడు ఇలాంటి ప్రకటనలు ఇస్తాడా?
– దేవుడు ఇతనికి ఏం పుట్టుక ఇచ్చాడో కానీ..రాజకీయాలంటే ఒక విలువ ఉండాలనేది మర్చిపోయాడు.
– వీళ్లు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఎన్నికల కమిషనే స్వయాన  సీఐడీని కేసు బుక్‌ చేయమని చెప్పింది.
– ఎన్నికల కమిషన్‌ ఈ ప్రకటనకు ఏం సమాధానం చెప్తుంది? 
– ప్రజలను గందరగోళానికి గురిచేయడం తప్పు కాదా? 
– రాజకీయం కోసం చంద్రబాబు, రామోజీలు ఏ గడ్డైనా కరుస్తారు.
– వీళ్లకి సమాజం పట్ల బాధ్యత అంటూ ఏమీ లేదు. 
– డబ్బులిచ్చినా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి గందరగోళానికి గురిచేయకూడదనే ఇంగిత జ్ఞానం లేదా?
– ఎందుకు ఆఖరి దశలో ఇలాంటి నీచమైన వ్యవహారాలు? 
– మీకు చంద్రబాబు ఇష్టమైతే, ప్రజలు హర్షిస్తే ముఖ్యమంత్రిని చేసుకోండి. కానీ ఇలాంటి నీచం దేనికీ?
– నువ్వు కాదు...నీ తల్లో జేజమ్మ వచ్చినా చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు..రామోజీ! 
– ఇలాంటి వెదవపనులు, వెదవ రాతలు రాసి పీకల్లోతు కూరుకుపోయారు.
– డబ్బులిస్తే ఏ గడ్డైనా కరవడమేనా ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ? 
– వాళ్లిచ్చిన యాడ్‌లో ఒక్క లైనన్నా వాస్తవం ఉందా? 
– మీరు ప్రజల్ని ఏ  విధంగా మభ్యపెట్టాలని చూస్తున్నారో ఇక్కడే తేలిపోతోంది. 
– ఒకరి భూమి ఒకరు తీసుకోడానికి ఎవరికి హక్కుంది?
– చంద్రబాబు ఎవడబ్బ సొమ్ము, ఎవడి అమ్మ సొమ్ము అంటూ మాట్లాడుతున్నాడు. ఇలాంటి భాష రాజకీయాల్లో మాట్లాడొచ్చా?
– ఎవడి సొమ్ము ఎవడు తీసుకోడానికి ఎవడికి హక్కుంది రామోజీ? 
– మీకు అసలు బుర్రా బుద్ధి ఉందా? 
– చంద్రబాబు వాడుతున్న భాషను వాడకూడదు అని మీ పత్రిక ద్వారా హెచ్చరించాల్సిన బాధ్యత మీపై లేదా?
– ఈ 40 ఏళ్లలో ఇంత దరిద్రమైన రాజకీయాలు నేను ఎప్పుడూ చూడలేదు.
– ఓ వైపు పేదలను బతకనివ్వరు..విద్యార్థులను చదువుకోనివ్వరు. రైతుల్ని బతకనివ్వరు. మహిళలు తమ గౌరవంగా బతుకనివ్వరు. 
– మళ్లీ వచ్చి ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ సమాజం పట్ల గౌరవం ఉన్నట్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.

నీ ఇంట్లో నాలుగు పదవులు లేవా చంద్రబాబూ?:
– మా ఇంట్లో ఉన్న పదవులన్నీ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వచ్చిన పదవులు చంద్రబాబూ..
– నీ ఇంట్లో నాలుగు పదవులు లేవా? నువ్వూ, నీ బామ్మర్ధి, నామినేట్‌ చేసుకున్న నీ కొడుకు, నీ కొడుకు తోడల్లుడు...మీ కుటుంబం కాదా?
– మీరంతా ఏమన్నా దైవ సంభూతులా? మీకేంటి ప్రత్యేకత.? మీకున్నదేంటి..మాకు లేనిదేంటి?
– ఆఖరికి నీ కొడుకును ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తే..మరుసటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎందుకు పనికిరాని శుంఠ నీ కొడుకు.
– నువ్వొచ్చి మాకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది.
– ఏ ఎండకు ఆ గొడుకు పట్టుకునే బతుకు నీది చంద్రబాబూ..!
– రాజకీయాల్లో నీలా ముఖ్యమంత్రిగా చేయకపోవచ్చు కానీ..రాజకీయాల్లో తలెత్తుకుని తిరిగే బతుకు మాది.
– మా ఇంట్లో వాళ్లు నీ కొడుకులాగా నామినేటెడ్‌ పదవులు చేస్తున్నారా? 
– నువ్వు అధికారంలో ఉండగానే కదా నేను ఎంపీ అయ్యాను..? మర్చిపోయావా? 
– నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా నా భార్య జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అయ్యింది? 
– నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా 2004లో నేనూ, మా తమ్ముడు పోటీ చేసి ఎమ్మెల్యేలమయ్యాం. 
– నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ కొడుకు పోటీ చేస్తే  ఓడిపోయాడు. 
– నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా నీ కొడుకి తొడళ్లుడు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. 
– రాజకీయాల్లో ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంతో హుందాగా ఉండాలి.
– మీ పనైపోయిందో..నా పనైపోయిందో జూన్‌ 4 నాడు తెలుస్తుంది. 

ఈ విధంగా ఈసీ కూటమికి లొంగిపోవడం సరైంది కాదు:
– కోర్టు ఆర్డర్‌ ఇచ్చినా మళ్లీ ఫిర్యాదు చేస్తే..ఎన్నికల కమిషన్‌ మాకు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి మేం చేస్తున్నాం అంటున్నారు.
– ఏదో ఒక విధంగా కోర్టు ఇచ్చిన సమయం అయిపోవాలనే ఆలోచన. 
– వీళ్లు ఎన్ని చేసినా ప్రజలు వాళ్లని నమ్మరు. ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. 
– ఎవరు మాట మీద నిలబడతారో..ఎవరు అబద్ధాలతో గోడలు కడతారో ప్రజలకు తెలుసు.
– జగన్‌మోహన్‌రెడ్డి గారంటే ఒక నమ్మకం..ఒక ధైర్యం. ఆయన పేరు చెబితే రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా.
– పేద వర్గాలకు చేయూతనిచ్చి వారిని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
– సేవ అనేది సమాజానికి చేయాలి కానీ..సామాజిక వర్గానికి కాదు.
– చంద్రబాబు బుర్రలో నుంచి సమాజం పోయి..సామాజికవర్గం వచ్చిందో అప్పుడే ఆయన పతనం అయ్యాడు.
– ఇప్పటికైనా సమాజం గురించి ఆలోచన చెయ్యి చంద్రబాబూ. 
– ఇక నిన్ను, నీ ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఎవరు హర్షిస్తారు?
– చంద్రబాబు చేసే ప్రతి పనిలో తన సామాజిక వర్గానికి చేసుకుంటున్న సేవ కనిపిస్తోంది.
– కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఈసీ కొర్రీలు పెట్టి డీబీటీని ఆపడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.
– ఈ విధంగా కూటమికి లొంగిపోవడం సరైంది కాదు.
– ఎన్నికలు అయిన తర్వాత మీకు రావాల్సిన లబ్ధి నూటికి నూరు శాతం వస్తుందని మేం స్పష్టంగా చెప్తున్నాం.
– మరో వైపు తప్పుడు అడ్వరై్టజ్‌మెంట్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈ పత్రికలకు కూడా ప్రజలు ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్తారు. 
– ఈ రోజు పత్రికల్లో వారు మాట్లాడిన, రాసిన రాతలు 13వ తేదీ తర్వాత రాయరు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు గురించి ఓ సారి మోడీని అడగాల్సింది:
– నిన్న మోడీ వచ్చినప్పుడు ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ గురించి అడగాల్సింది? 
– వీళ్లంతా అవసరానికి అనుగుణంగా మాటలు మారుస్తుంటారు. 
– ఈయనేమో అమరావతే రాజధాని అంటాడు. వాళ్ల అభ్యర్థి వచ్చి విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటే బాగుంటుంది అంటాడు.
– మాకు ధైర్యం ఉంది కాబట్టే మా మేనిఫెస్టోలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అని మా ముఖ్యమంత్రి గారు పెట్టారు.
– అమరావతే రాజధాని అని నువ్వెందుకు నీ మేనిఫెస్టోలో పెట్టలేదు చంద్రబాబూ? 
– ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సమంగా అభివృద్ధి చెందాలని, సమన్యాయం ఉండాలని మేం మేనిఫెస్టోలో «ధైర్యంగా పెట్టాం.
– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినా..చంద్రబాబును ఇవాళ్టికీ ఎందుకు నమ్మరంటే అతనికి నిజాయితీ లేకపోవడమే.
– రాజకీయాల్లో నిబద్ధతకు నిదర్శనంగా ఒక పేరు చెప్పమంటే మాట తప్పని, మడమ తిప్పని జగన్‌ గారి పేరే చెప్తారు.
– తెలుగుదేశం, కూటమిలో ఉన్న పార్టీల వత్తిడి మేరకు వారితో కుమ్మక్కై చేసిన కార్యక్రమమే ఇది.
– ఎన్నికల కమిషనే స్వయంగా సీఐడీ కేసు పెట్టమన్న సందర్భంలో ఈ అడ్వరై్టజ్‌మెంట్‌ను సూమోటోగా తీసుకోవాలి కదా? 
– మరో రెండు మూడు రోజులు ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలను భరించాల్సిందే.
–  గంజాయి కేపిటల్‌గా ఎవరు చేస్తున్నారు.? మొన్న పోర్ట్‌లో పట్టుకుని డ్రగ్స్‌ ఎవరివి?
– సాక్షాత్తు చంద్రబాబు, ఆయన వదిన గారి బంధువులవే కదా? ఇప్పుడు ఎందుకు ఆ కేసు బయట పెట్టడం లేదు? ఏమైంది ఆ కేసు? 
– ఏమైంది ఆ సీబీఐ, ఎక్కడుంది? ఎందుకు మీ పత్రికల్లో ఆ కేసు ఏమైంది అని రాయడం లేదు?
– అదే పొరపాటున వైఎస్సార్సీపీ వాళ్లుంటే బట్టలూడదీనినట్లు వ్యవహరించేవారే కదా?
– ఎందుకు ఈ కేసు గురించి చంద్రబాబు మాట్లాడటం లేదు?
– గంజాయి ఈ ప్రాంతంలో ఉందని మేము చెప్పడం లేదు. వాళ్ల మంత్రులే నువ్వు గంజాయి దొంగంటే..నువ్వని కొట్టుకున్నారు.

Back to Top