ఈ యుద్ధంలో ప్రతి సైనికుడికి అండగా నిలుస్తా

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్ జగన్ ట్వీట్‌

తాడేపల్లి: రాక్షస ఎల్లోమీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో కచ్చితంగా న్యాయమే గెలుస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

‘మేము రాక్షస ఎల్లోమీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్దంలో మా కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో మా ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తా. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది’ అని వైయ‌స్ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Back to Top