తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ప్రపంచం ఎంతో మారింది. కానీ చంద్రబాబు మారడు. పుట్టిన దగ్గర నుంచి అవే అబద్ధాలు, అవే మోసాలు. జ్ఞానం కలగాల్సిన వయస్సులో కూడా ఏమాత్రం సంకోచించక, వెనకాడకుండా పాపాలు చేస్తూనే వున్నాడు. నరకం ఇతనికి చాలదు...యముడు ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. ఆ యముడ్ని కూడా తప్పు దారి పట్టిస్తాడేమో! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.