రాష్ట్రం ఒప్పందం సెకీతోనే కదా?: మిథున్‌రెడ్డి 

సెకీ తనంతకు తానుగా అత్యంత చౌకగా యూనిట్‌ రూ.2.49కు ఇస్తానని ముందుకొచ్చింది

ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం.. ఇందులో లంచాలకు తావెక్కడ?

అఖిలపక్ష సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ  లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి , రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందనివైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. సోమవారం నుంచి పార్ల­మెంట్‌ శీతాకాల సమావే­శాలు జరగనున్న నేప­థ్యంలో రక్షణశాఖ రాజ్‌నాథ్‌­సింగ్‌ అధ్యక్ష­తన ఆదివారం అఖిలపక్ష సమావేశం జరి­గింది. వైయ‌స్ఆర్‌సీపీ తరపున రాజ్యసభ పక్ష­నేత విజయ­సాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్‌­రెడ్డి హాజర­య్యారు. 

మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు­త్వ రంగసంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరే­షన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) తనంతకు తాను అత్యంత చౌకగా యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49తో ఇస్తామని ముందుకొచ్చిందన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అని, ఇందులో లంచాలకు తావెక్కడ ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెకీతో­నే ఒప్పందాలు జరిగాయి తప్ప.. అదానీతో  కాదని తేల్చిచెప్పారు. కావాలనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందన్నారు. 

పోలవరంపై భిన్న వ్యాఖ్యలు
అనంతరం లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి మీడి­యాతో మాట్లాడుతూ.. పోలవరం విష­యంలో ఇటీ­వల మంత్రుల నుంచి భిన్నమైన స్టేట్‌మెంట్స్‌ వస్తున్నా­యన్నారు. మొదట్లో ఉన్న ఎత్తు ఇప్పుడు ఉంటుందా లేదా అనే అనుమా­నాలు వ్యక్తం అవుతు­న్నాయన్నారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో చర్చిస్తామన్నారు. పునర్విభజన చట్టంలోని అనేక హామీలను కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు. 

ఈ హామీ­లను అమలు చేయాలని కోరామన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొ­ద్దని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామ­న్నారు. ఈ సమా­­వేశాల్లోనే కేంద్రం వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్ట­బోతున్నట్టు తెలి­పిందన్నారు. మైనార్టీల­కు అన్యా­యం జరగకుండా, వారి పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ నిలబడుతుందన్నారు. ఇప్పటికే వక్ఫ్‌ బిల్లుపై రాజ్యసభ పక్షనేత విజయ­సాయిరెడ్డి తమ పార్టీ వైఖరేమిటో తెలిపారన్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠిన విధా­నాలు అ­వ­స­­­రమని చెప్పామన్నారు.

‘సోషల్‌’ అరెస్టులపై గొంతెత్తుతాం
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై దారుణంగా వ్యవహ­రిస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేస్తున్న విషయాన్ని అఖిల­పక్షం దృష్టికి తీసుకెళ్లామని మిథున్‌రెడ్డి తెలిపారు. సోషల్‌ మీడియా పోస్టులపై కార్యకర్తలపై పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా.. సంబంధం లేని సెక్షన్లు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్న విషయాన్ని వివరించామన్నారు. దీనిపై పార్లమెంట్‌ సమావేశాల్లో గొంతెత్తుతామని చెప్పారు.

Back to Top