వైయస్ఆర్‌జిల్లా : అధికారం చేతిలో ఉందని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ హెచ్చరించారు. వందేళ్ల క్రితమే కనుమరుగైన వాగు పేరుతో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రోద్బలంతో వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతున్నాయి. అన్నీ అనుమతులు ఉన్నప్పటికీ వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ భాగస్వామిగా ఉన్న లే అవుట్‌పైకి ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే పంపించారు. లే అవుట్ నుండి వాగు వెళ్తోందంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వందేళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం మొదలుపట్టారు. ఈ అంశంపై హై కోర్టులో స్టే ఉన్నా ఇబ్బంది పెట్టేందుకు కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లే అవుట్ వద్దకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మేయర్ సురేష్ బాబు, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర కార్పొరేటర్లు బుధవారం చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..‘కోర్టులో స్టే ఉన్నా రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు.