ఏలూరు కార్పొరేషన్‌లో ప్రజల సొమ్ముకు లెక్క చెప్పాలి

కూటమి పాలనలో అవినీతిపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలి

మామిళ్లపల్లి జయప్రకాష్ డిమాండ్‌

ఏలూరు: ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రజలు చెల్లించిన ఇంటి పన్నులు, ప్రభుత్వ దుకాణాల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధుల్లో అవకతవకలు జరిగాయంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌ ఆరోపించారు. అసలు బాధ్యులను తప్పించి చిన్నస్థాయి ఉద్యోగులను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్‌లో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విజిలెన్స్‌ విచారణతో పాటు పూర్తి ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజల సొమ్ము దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని, అక్రమంగా వినియోగించిన నిధులను తిరిగి కార్పొరేషన్‌ ఖాతాలో జమ చేయాలని కోరుతూ జయప్రకాష్‌ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఏలూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాయి. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేషన్‌లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయి ఆడిట్‌ నిర్వహించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.


 

Back to Top