'అన్నదాత పోరు`కు అడ‌గ‌డుగునా అడ్డంకులు

యూరియా కొరతపై నేడు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం 

అనుమతి లేదంటు పోలీసులు ఆంక్ష‌లు

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల నేతల హౌస్ అరెస్ట్‌లు

తాడేప‌ల్లి:  యూరియా కొరత సహా అనేక రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు ఇవాళ రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాల‌యాల ఎదుట ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు.  రైతుల నిరసనలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెర లేపింది. అన్న‌దాత పోరుకు అనుమతి లేదంటూ ఆంక్ష‌లు పెట్టి అడ్డంకులు సృష్టిస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను, రైతుల‌ను గృహ నిర్బందం చేస్తోంది. బ‌య‌ట‌కు వ‌స్తే అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే అనేక మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు, అరెస్టులపై చూపుతున్న శ్రద్ద యూరియా కొరతపై  ఎందుకు చూప‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.  ఎంతమందిని అరెస్టు చేసినా రైతుల పక్షాన పోరాటం చేస్తామమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు.  

అన‌కాప‌ల్లి జిల్లా..
అన్నదాత పోరుకు హాజరు కాకుండా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
తెల్లవారుజామున నాలుగు గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు
వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేతలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గృహ నిర్బంధం  
పోలీసులు అడ్డుకున్న సరే అన్నదాత పోరును విజయవంతం చేసి తీరుతామంటున్నవైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు హౌస్ అరెస్ట్ 
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును గుంటూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు. ఈ సందర్బంగా  నంబూరు శంకరరావు  మాట్లాడుతూ.. రైతు సమస్యలపై వినతిపత్రం అందజేయడానికి వెళ్తుంటే కూటమి ప్రభుత్వం ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత రాష్టం రావణకాష్టం అయ్యిందన్నారు. రైతులు ఎరువుల కోసం ఎండలో పడికాపులు కాస్తున్నారన్నారు. వారి సమస్యను ప్రభుత్వం తీసుకొని వెళ్లేందుకు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రివర్యులు వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశాలు మేరకు తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్యకర్తలను నిర్బంధించ‌డం స‌రికాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టిన రైతులు, ప్రజలు పడుతున్న సమస్యలపై వై యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని నంబూరు శంకరరావు హెచ్చ‌రించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ స‌భ్యుడు, వినుకొండ మాజీ శాసనసభ్యులు  బొల్లా బ్రహ్మనాయుడును వినుకొండ పోలీసులు  హౌస్ అరెస్ట్ చేశారు. అన్న‌దాత పోరుకు అనుమ‌తి లేదంటూ బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా అడ్డుకున్న పోలీసులు .  రైతుల సమస్యలపై పోరాటానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని బొల్లా బ్రహ్మనాయుడు పోలీసుల తీరుపై మండిప‌డ్డారు. కూటమి సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టిన రైతుల సమస్యలపై పోరాటం ఆపమని హెచ్చ‌రించారు.  

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Image

మాచ‌ర్ల‌లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి హౌస్ అరెస్ట్ 
రైతుల‌కు యూరియా, ఎరువులు అందక  బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ రైతుల పొట్ట కొడుతున్న కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతు ధర్నాకు పిలుపునిచ్చింది. ప్రధానంగా పల్నాడులో పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా పల్నాడు జిల్లాలో  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రైతుల్లో చైతన్యం తెస్తూ రైతు ధర్నా కు మద్దతు కూడగడుతున్నారు. అన్న‌దాత పోరుకు వేలాదిగా రైతులు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు తరలి రానున్నట్లు ఇంటెలిజెన్స్ నిఘాతో  కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మాచర్ల లో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటిని చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని ఇంటి నుంచి కదలనీయకుండా చేసి, ధర్నాకు సన్నద్ధమయ్యే రైతులను నిర్బంధించి రైతు ధర్నాను విఫలం చేయాలని సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

Image

పిన్నెల్లి ర్యాలీతో కూటమి నేతల్లో గుబులు

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల కు వచ్చే ముందు తాళ్లపల్లి వద్ద నుంచి అభిమానులు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. దీంతో కూటమి నేతల్లో గుబులు మొదలైంది. పిన్నెల్లి క్రేజ్ ను ఎలాగైనా నిలువరించాలనే ఉద్దేశంతో పోలీసులను సాకుగా చూపి హౌస్ అరెస్ట్ చేయించారు. పిన్నెల్లి హౌస్ అరెస్ట్ ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని రైతు నాయకులు మండి పడుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హౌస్ అరెస్ట్ తో  రైతుల్లో పెల్లుబుకుతున్న ఆవేదనను,ఆందోళన ను నిలువరించలేరు. తమకు ఎరువులు, యూరియా బ్లాక్ మార్కెట్ కు పోకుండా సక్రమంగా అందించాలని ప్రజా స్వామ్య యుతంగా వైయ‌స్ఆర్‌సీపీ తలపెట్టిన ధర్నా అడ్డుకునేందుకు పోలీసుల సాకు చూపి పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేయడం పట్ల సామాన్య ప్రజల్లో సైతం కూటమి ప్రభుత్వ నిర్వాకం పట్ల ఆగ్రహం పెల్లుబికుతోంది.

గూడూరులో శాసన మండల సభ్యుడు, వైయ‌స్ఆర్‌సీపీ గూడూరు సమన్వయకర్త మేరకు మురళికి పోలీసులు నోటీసులు అందించారు. అన్న‌దాత పోరు కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు అనుమ‌తి లేదంటూ ఆయ‌న్ను గృహ నిర్బంధంలో ఉంచారు.  

Image 

శ్రీ‌కాకులం జిల్లాలో మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయ‌న ఇంటి వద్ద నుంచి రైతులు ర్యాలీ నిర్వహించవద్దని పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బయటకు రాకుండా నియంత్రిస్తున్నార‌ని సీదిరి అప్ప‌ల‌రాజు మండిప‌డ్డారు. 

Image

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ నివాసం వద్ద పోలీసుల మోహరించి ర్యాలీని అడ్డుకున్నారు. నందిగామలో జరగనున్న "అన్నదాత పోరు కార్యక్రమానికి బయల్దేరిన స్వామిదాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. స్వామిదాస్ మినహా పార్టీ నాయకుల పర్మిషన్ లేదంటూ  బ‌య‌ట‌కు రాకుండా పోలీసులు అడ్డుక‌ట్ట 

అన్నదాత పోరు ఆపేదే లేదు:  మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు   
యూరియ ఎరువుల కొరతతో రైతులు ఎదురుకొంటున్న సమస్యల పై వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ లకు వినతిపత్రం అందజేయనున్నాం . శాంతియుతంగా ర్యాలీ చేసి ఆర్డీఓ లకు రైతులతో, పార్టీ నేతలతో కలిసి రైతుల సమస్యల పై వినతిపత్రం అందజేస్తాం. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని అనగా తొక్కాలని చూస్తుంది. యూరియ ఎరువుల కొరత లేకుంటే ఎందుకు కూటమి ప్రభుత్వం బయపడుతుంది . వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఇళ్ల ముందు పోలీసులను పెట్టి ఎందుకు నిర్భందిస్తున్నారు. రైతులు ఎందుకు రాత్రింబ‌గలు లైన్లలో నిలబడి ఇబ్బంది పడుతున్నారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉంటూ యూరియ తేవడంలో కూటమి విఫలమైంది .ఎంత మంది పోలీసులను పెట్టిన ఈ రోజు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీరుతాం

Image

ఎన్ని అడ్డంకులు సృష్టించినా ’నిరసన’ ఆపేది లేదు: అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం జిల్లాలో పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ నిరసనపై  ఆంక్షలు విధించారు.
ర్యాలీ చేపట్టవద్దని పోలీసుల హెచ్చరికలు
వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
20 మంది కంటే ఎక్కువ మంది వెళ్లొద్దని ఆంక్షలు
పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన అనంత వెంకటరామిరెడ్డి
రైతుల కోసం ఉద్యమం చేస్తే సీఎం చంద్రబాబు సహించలేకపోతున్నారు

Image

ఆంక్షలకు బెదరం.. గళం వినిపిస్తాం: ఎస్వీ మోహన్‌రెడ్డి

కర్నూలు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ తలపెట్టిన అన్నదాత పోరుపై పోలీసులు ఆంక్షలు
తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటికెళ్లిన పోలీసులు
30 యాక్ట్ అమలులో ఉందంటూ పోలీసులు నోటీసులు..
నిరసన ర్యాలీలు చేపట్టకుడదని.. కేవలం పది మందితో ఆర్డీవోకి వినతిపత్రం అందించాలంటూ పోలీసుల ఆదేశం 
నిరసన, ర్యాలీలు చేస్తే.. అరెస్టు చేస్తామంటూ పోలీసుల బెదిరింపులు

Back to Top