ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదు

టీడీపీ అరాచకాలకు వైయస్‌ఆర్‌సీపీ భయపడదు

ఓట్ల తొలగింపుపై ఎలక్షన్‌ కమిషన్‌ స్పందించాలి

వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ:చంద్రబాబు ఓటమి భయం పట్టుకుందని వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేల పేరుతో ట్యాబ్‌లతో వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగిస్తున్న వారిని విజయనగరం జిల్లాల్లో ట్యాబ్‌లతో సహా వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పట్టుకుని.. సాక్షాత్తూ డీజీపీకి,ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని.. ఇంతవరుకూ వారి మీద కేసులు కూడా పెట్టలేదన్నారు.ఎవరైతే స్టేషన్‌కు తీసుకొచ్చి ట్యాబ్‌లు,వారి మనుషులను అప్పగించారో వారిపైనే తిరిగి కేసులు పెట్టారన్నారు. అదేవిధంగా నిన్న  చిత్తూరు జిల్లాలో కూడా అలాగే జరిగిందన్నారు.

ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,వైయస్‌ఆర్‌సీపీ నేతలను అర్ధరాత్రులు పోలీస్‌స్టేషన్లు తిప్పడం అమానుషమన్నారు. చంద్రబాబు పోలీసులతో వైయస్‌ఆర్‌సీపీ నేతలను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.టీడీపీ అరాచకాలకు  వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు  భయపడే పరిస్థితి లేదన్నారు. ఓట్ల తొలగింపుపై ఎలక్షన్‌ కమిషన్‌ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలో 60 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని స్వయంగా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, వైయస్‌ఆర్‌సీ నేతలు ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడంలేదన్నారు. ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష పడుతుందన్నారు.రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కొల్పోయే పరిస్థితి ఉందనే భయంతోనే వైయస్‌ఆర్‌సీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.రానున్న ఎన్నికల్లో తప్పకుండా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంతి అయి తీరతారన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top