బీసీ కమీషన్‌కు చట్టబద్ధత చరిత్రలో మైలురాయి...

బీసీల కోసం ఆలోచించే వ్యక్తి వైయస్‌ జగన్‌..

జననేతతో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం...

వైయస్‌ఆర్‌సీపీ నేత కొలుసు పార్థసారథి

విజయవాడ: బీసీలు గురించి ఆలోచించే వ్యక్తి  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పార్థసారధి అన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.బీసీ డిక్లరేషన్‌పై అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. బీసీలకు మేలు చేయడానికి మొట్టమొదటిసారిగా వైయస్‌ జగన్‌మోహ¯Œ  రెడ్డి ఆలోచన చేశారన్నారు. ఓట్లు కోసం తాయిలాలు వేసినట్లు కాకుండా,రాజకీయ మాటలు కాకుండా వైయస్‌ జగన్‌ చెప్పిన చెప్పిన ప్రతి మాటకు కూడా చట్టబద్దత కలిస్తానని చెప్పడం దేశంలో కూడా ఎవరు ఊహించలేదన్నారు. అనేక రాజకీయ పక్షాలను చూశామని, అనేక ఎన్నికలు చూశామని.. ప్రతి ఎన్నికల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారీటీ అనేది..ఓట్లును ఆకర్షించే పదంలా అయిపోయింది తప్పిదే..వారు ఏవిధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారి జీవితంలో  మార్పు తీసుకురావాలనే ఆలోచన చేయలేదన్నారు. కుయుక్తుల రాజకీయాలు చేశారన్నారు. వైయస్‌ జగన్‌ మాత్రమే బీసీ కోసం ప్రతి హామీకి చట్టబద్ధత ఎలా కల్పించాలని ఆలోచించారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాప్రతయం రాజకీయ అధికారం,కుర్చి కోసం కాదన్నారు. ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకోవాలనే ఆశకు దర్పణం అని అన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలోఓ రాబోయే రోజుల్లో బలహీన,పేదల వర్గాల రాజ్యం రాబోతుందని బీసీలు భావిస్తున్నారన్నారు. ప్రజలకు తలఎత్తుకుని బతక గలిగే పరిస్థితులు రానున్నాయని, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే నాయకుడు రాబోతున్నారని భావిస్తున్నారన్నారు.

బీసీ కమిషన్‌ను తూతూమంత్రంగా వేస్తున్నారని,ఎటువంటి మార్గదర్శకాలు లేకుండా గందరగోళం తయారవుతుందన్నారు.వాటికి బడ్జెట్‌ కేటాయింపు కూడా ఉండదన్నారు. అటువంటి బీసీ కమీషన్‌కు చట్టబద్దత కల్పిస్తానని వైయస్‌ జగన్‌ ప్రకటించడం రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. కమీషన్‌లో అనేక అంశాలను చర్చిస్తామని జగన్‌ తెలిపారన్నారు. శాశ్వత ప్రతిపాదికన బీసీ రిజర్వేషన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీసీల్లో కొన్ని కులాలు..కొన్ని ప్రాంతాల్లో ఉంటే..కొన్ని ప్రాంతాల్లో ఉండవని.. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కులం...కృష్ణా జిల్లాలో ఉండకపోవచ్చు...ఏళ్ల తరబడి జీవిస్తున్నా వారికి సర్టిఫికెట్లు కావాలంటే రెవెన్యూ అధికారులు రిజెక్ట్‌  చేసే పరిస్థితి ఉందన్నారు. చాలా కులాల్లో వారి ఆర్థిక,సామాజిక, విద్యపరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఇతర రాష్ట్రాల్లో వారి వర్గానికి, వారి వృత్తికి ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని వర్గీకరణను మార్పుచేయాలని  కోరుతున్నారన్నారు. అలాగే వైయస్‌జగన్‌ వాస్తవాలు చెప్పారన్నారు.ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.ఎస్సీని బీసీలో చేర్చాలన్నా..బీసీలను ఎస్సీలో చేర్చాలన్న తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలన్నారు.రాష్ట్ర పరిధిలో లేనిదన్నారు. అసెంబ్లీలో కేవలం తీర్మానం మాత్రమే చేయగలమని తెలిపారని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితోనే దానిని సాధించుకోగలమని వాస్తవాలు చెప్పారన్నారు.ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.

అచ్చెన్నాయుడు సవాల్‌ను స్వీకరిస్తున్నాం
టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు బీసీలపై చర్చకు వస్తే వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి సవాల్‌ విసిరారు. వైయస్‌ జగన్‌ సంకల్పాన్ని గుర్తించాలని ఆయన బీసీలకు విజ్ఞప్తి చేశారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన ప్రతి హామీ కూడా మానవత్వంతో బలహీన వర్గాలు ఉన్నతంగా బతకాలనే ఉద్దేశం ఉందన్నారు. వైయస్‌ జగన్‌పై విమర్శలకే చంద్రబాబు పరిమితమవుతున్నారన్నారు. ఇన్నాళ్లు బీసీ సామాజిక వర్గాలను పట్టించుకోకుండా  మంచి చేస్తామన్న వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. అన్ని విషయాలపై బహిరంగ చర్చకు సిద్ధమే అన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top