మంగళగిరి: ఏలూరు జిల్లా చింతలపూడి వైయస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి కంభం విజయరాజు కుమారుడి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకలో నూతన వధూవరులు కీర్తి రావు, ప్రవీణ్ గౌతమ్ (ఐపీఎస్) లను కలిసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కంభం విజయరాజు కుటుంబ సభ్యులను వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రేణులతో కొద్దిసేపు ముచ్చటించారు. వివాహ వేడుకలో పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.