టీడీపీ కార్యకర్త కుటుంబం వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

 నల్లగట్ల స్వామిదాస్ సమక్షంలో పార్టీలో చేరిన గుళ్లపూడి కుటుంబం

 తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతం దిశగా మరో కీలక చేరిక జరిగింది. గంపలగూడెం మండలం గుళ్లపూడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మోదుగు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తిరువూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నాయకులు పోట్రు ముత్తయ్య, పోట్రు శశాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

  ప్రజల విశ్వాసమే వైయ‌స్ఆర్‌సీపీ బలం

ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు సాగుతోందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు యరమల రామచంద్రరెడ్డి, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షులు కావూరి వినయ్‌కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top