డీఎస్సీ అక్రమాలపై పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

 చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ ఎంసీ విజయానంద రెడ్డి

 చిత్తూరు: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టనున్న పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని చిత్తూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరులోని వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో యువత, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాలకు చెందిన నాయకులు, సభ్యులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎంసీ విజయానంద రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని సూచించారు. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తూ, ప్రతి కార్యకర్త ప్రజల మధ్య చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.

సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలి

యువత, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రానున్న నిరసన కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top