డీఎస్సీ అక్రమాలపై తునిలో టౌన్‌హాల్ సమావేశం

 అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దాడిశెట్టి రాజా

తుని: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తునిలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, తుని నియోజకవర్గ నాయకుడు దాడిశెట్టి రాజా పాల్గొని డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను తెలుసుకున్నారు.

అభ్యర్థుల ఆవేదనలను విన్న నాయకులు

ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నియామక ప్రక్రియపై వ్యక్తం చేస్తున్న సందేహాలను పార్టీ నాయకులు విన్నారు. నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించి, అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 నిరుద్యోగ యువతకు వైయ‌స్ఆర్‌సీపీ అండ

డీఎస్సీ నియామకాలపై నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేసి, బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని దాడిశెట్టి రాజా కోరారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Back to Top