రేపు రాజమండ్రి రూరల్‌ నేతలతో వైయస్‌ జగన్‌ సమావేశం

తాడేపల్లి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (19.08.2026) రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణపై వైయస్‌ జగన్‌ వారితో చర్చించనున్నారు.
 

Back to Top