యాదవ సంఘాల ప్రతినిధుల‌కు భూమన అభినయ్‌రెడ్డి పరామర్శ

తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో అరెస్టైన యాదవ సంఘాల ప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు రేణుక యాదవ్‌, డాక్టర్‌ శిరీష యాదవ్‌, గీతా యాదవ్‌లను తిరుపతి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి పరామర్శించారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై వేధింపులు పెరిగిపోయాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో అరాచక పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఇంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. టిడిపి ఇన్‌చార్జి జె.బి. శ్రీనివాస్‌ ఇంటిపై దాడి చేశారంటూ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు.

వాసు యాదవ్‌ తల్లి రేణుక యాదవ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని భూమన అభినయ్‌రెడ్డి స్పష్టం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పార్టీ అండగా నిలుస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి తోడుగా ఉంటామని తెలిపారు.

Back to Top