కాసేప‌ట్లో రాజమండ్రి రూరల్‌ నేతలతో  వైయస్‌ జగన్‌ సమావేశం

 పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

 తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నేడు రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై శ్రీ వైయస్‌ జగన్‌ నేతలతో చర్చించనున్నారు. అలాగే భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.

Back to Top