మీ ప్రేమాభిమానాలే నా బలం

రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కచెల్లెమ్మలకు వైయ‌స్ జగన్‌ శుభాకాంక్షలు

తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికీ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తనపై అక్కచెల్లెమ్మలు చూపిస్తున్న ప్రేమాభిమానాలే తనకు బలమని, కొండంత ధైర్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

“మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అని వైయ‌స్ జగన్‌ తన సందేశంలో తెలిపారు.  

రాఖీ పౌర్ణమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలను నింపాలని వైయ‌స్ జగన్‌ ఆకాంక్షించారు. రాష్ట్రంలోని తన అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
 

Back to Top