శ్రీకాకుళం : బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అని వైయస్ఆర్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని జాబిలి ఫంక్షన్ హాల్‌లో యువ నాయకుడు ధర్మాన రామమనోహర్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ ఏజెంట్లపై ఉందన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త సమర్థవంతంగా పనిచేసేలా శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, నియోజకవర్గ పరిశీలకులు పినిమింటి సాయి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు దామ మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. వారు కూడా బూత్ స్థాయి వ్యవస్థను మరింత బలోపేతం చేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.