వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలపై హేయమైన వ్యాఖ్యలు 

టీడీపీ కూటమి నేతలపై తక్షణ చర్యలు తీసుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నాయకురాళ్ల డిమాండ్‌

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలపై దారుణ వ్యాఖ్యలు చేసి, అవమానించిన టీడీపీ కూటమి నేతలు నారా లోకేష్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతమనేని ప్రభాకర్, బండారు సత్యనారాయణమూర్తి, గాలి భానుప్రకాష్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌కు వైయస్సార్‌సీపీ మíßళా నాయకురాళ్లు ఫిర్యాదు చేశారు.
ఆ మేరకు వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నాయకురాళ్లు ఉప్పాల హారిక, రాయన భాగ్యలక్ష్మి, ఆరె శ్యామల, బండి పుణ్యశీల, పరమ్‌ త్రివేణి తదితరులు రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయానికి వెళ్లగా, అక్కడ ఛైర్‌పర్సన్‌ అందుబాటులో లేకపోవడంతో, సెక్రటరీకి తమ ఫిర్యాదులు అందజేశారు. ముందుగా సమాచారం ఇచ్చి, అపాయింట్‌మెంట్‌ కోరి వచ్చినప్పటికీ, కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ ఉద్దేశపూర్వకంగానే ఆఫీస్‌లో లేరని వారు ఆగ్రహించారు.

మంగళగిరి: రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యదర్శికి టీడీపీ నేతలపై ఫిర్యాదు పత్రాలు సమర్పించిన తర్వాత వైయస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు మీడియాతో మాట్లాడారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసిన టీడీపీ కూటమి నేతలపై మహిళా కమిషన్‌ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా వైయస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు ఎవరెవరు, ఏమేం మాట్లాడారంటే..:

ఉప్పాల హారిక, ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌:
– రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కూటమి పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి. గౌరవం అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి. దాన్ని బట్టి రియాక్షన్‌ ఉంటుంది. హోం మంత్రి అనిత మాజీ ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. వైయస్‌ విజయమ్మ, భారతమ్మ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజాపైనా టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇంకా నన్ను నడిరోడ్డుపై అడ్డుకొని, నా కారు ధ్వంసం చేశారు, బూతులు మాట్లాడారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన మహిళా కమిషన్‌ ఏం చేసింది? నాపై దాడి చేసిన అందరిపై కేసు నమోదు చేసి శిక్షించాలి. 

రాయన భాగ్యలక్ష్మి, విజయావాడ మాజీ మేయర్‌:
– వైయస్‌ఆర్‌సీపీ మహిళా ప్రజాప్రతినిధులను కూటమి నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రులు, డిప్యూటీ సీఎం ఇలా స్థాయి మరచి అసహ్యంగా, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా ఛానల్స్‌ చూడటానికి కూడా మహిళలు భయపడుతున్నారు. పవన్‌కళ్యాణ్‌ మాజీ మంత్రి ఆర్‌.కే. రోజాను డైమండ్‌ రాణి అంటూ హేళనగా మాట్లాడారు. చింతమనేని ప్రభాకర్‌పై 94 కేసులు ఉన్నా ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారు. మహిళా తహశీల్దార్‌ను జుట్టుపట్టుకుని లాగుతాడు. మాజీ మంత్రి విడదల రజనిని మేకప్‌ మంత్రి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు? రాష్ట్రంలో మహిళా హోం మంత్రి ఉండి ఏం చేస్తున్నారు?.
విజయవాడలో లాకప్‌ డెత్, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. హోం మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అన్యాయంపై మా పోరాటం కొనసాగుతుంది. 

బండి పుణ్యశీల, వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి:
– హోం మంత్రి అనిత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేశారు. భర్తను కొట్టి మొగశాలకు ఎక్కినట్లుగా హోం మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి. మేకప్‌పై పెట్టిన శ్రద్ధ మహిళల భద్రతపై పెట్టడం లేదు. ఈరోజు ఉమెన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేద్దామని వస్తే ఛైర్‌పర్సన్‌ అందుబాటులో లేదు. సెక్రటరీకి వినతిపత్రం ఇవ్వమన్నారు. దళిత మహిళను ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వేధిస్తే సుమోటోగా ఎందుకు కేసు నమోదు చేయలేదు? తాతంశెట్టి నాగేంద్ర అదే మహిళపై దాడి చేస్తే ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయలేదు? జ్ఞానేశ్వరి కేసు వెలుగులోకి వచ్చే వరకు ఉమెన్‌ కమిషన్‌ నిద్రపోతుందా?. ఏబీఎన్‌ రాధాకృష్ణ వైయస్‌ఆర్‌సీపీ నేతల భార్యల గురించి వక్రీకరించి మాట్లాడినప్పుడు కమిషన్‌ ఏం చేసింది? ఇకనైనా వైయస్సార్‌సీపీ మహిళలను నీచంగా మాట్లాడటం మానుకోవాలి. సామాన్య ప్రజలకు సమన్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి.

ఆరె శ్యామల, వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి:
– ఇవాళ ఐదు రకాల ఫిర్యాదులను ఏపీ మహిళా కమిషన్‌కు అందజేశాం.

ఎన్నికలకు ముందు నారా లోకేష్‌ యువగళం అన్నారు. అధికారంలోకి వచ్చాక మౌనగళం పాటిస్తున్నారు. ఆరోజు ఆడబిడ్డలకు అండగా ఈ అన్న ఉంటాడు అన్నారు. ఈరోజు అదే అన్నా ఎక్కడ ఉన్నారు. క్రికెట్‌ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? వైయస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్‌మీట్లు పెట్టిన లోకేష్‌.. ఈరోజు సెల్ఫీ మీట్లు తప్ప ఎక్కడా, మాట్లాడటం లేదు. మీరు చూపించే రెడ్‌బుక్‌లో కేవలం వైయస్‌ఆర్‌సీపీ నేతల పేర్లు మాత్రమే ఉన్నాయా? లేక రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితుల పేర్లు కూడా ఉన్నాయా?
రెడ్‌బుక్‌లో యాడ్‌ చేయాల్సిన పేర్లు నిందితులవి ఉండాలి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదట లోకేష్‌ తన పేరు రాసుకోవాలి. శాసనమండలిలో వరుదు కళ్యాణిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా చూశారు. యథారాజా తథా ప్రజా అన్నట్లుగా మీ పార్టీ నేతలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. రెడ్‌బుక్‌ పాలన అంటూ కబుర్లు చెప్పడం, హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు.
హోం మంత్రి ఇలాకాలోనే ఆడపిల్లలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో మహిళలపై ట్రోల్స్, ఫొటో మార్ఫింగ్‌ జరుగుతోంది. అయినా ఏ చర్యలు లేవు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఉపయోగించిన ‘‘మేకప్‌’’ మాట పెద్ద బూతా? మేకప్‌పై మాట్లాడుతున్న అనితకు ప్రజలు ప్యాకప్‌ చేయడం ఖాయం.

Back to Top